E-Paper
Advertisement

Bigg Boss 9 Elimination: లీస్ట్‌లో దివ్య, సంజన.. ఈ వారం హౌజ్‌ నుంచి ఈమె అవుట్‌!

Bigg Boss 9 Elimination: లీస్ట్‌లో దివ్య, సంజన.. ఈ వారం హౌజ్‌ నుంచి ఈమె అవుట్‌!
Advertisement

Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ తెలుగు 9 ముగింపుకు చేరువలో ఉంది. మరో నాలుగు వారాల్లో షోకి ఎండ్‌ కార్డు పడబోతుంది. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ తెలుగు పదకొండవ వారం ముగించుకోబోతోంది. ఈ రోజు శనివారం అంటే వీకెండ్‌ ఎపిసోడ్. అంటే రేపు హౌజ్ నుంచి ఎవరోకరు బయటకు వెళ్లక తప్పదు. ఈ వారం నామినేషన్‌లో ఉన్నవాళ్లంత స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌. కళ్యాణ్‌ పడాల, డిమోప్‌ పవన్‌, ఇమ్మాన్యుయేల్‌, డిమోన్, సంజన, దివ్యలు ఉన్న ఈ వారం నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరోకరకు రేపు ఎలిమినేట్‌ కాబోతున్నారు.

అంత స్ట్రాంగే కంటెస్టేంట్స్‌

అంత స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్ నామినేషన్‌లో ఉండటంతో ఈ వారం ఎలిమినేషన్‌ ఉండకపోవచ్చే టాక్‌ కూడా వినిపిస్తుంది. కానీ, సోషల్‌ మీడియా బజ్‌ ప్రకారం రేపు ఓ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ బయటకు వస్తున్నారట. మరి వాళ్లేవరూ, ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉందేవరో చూద్దాం!… బిగ్‌ బాస్‌ ఫైనల్‌కు దగ్గర పడుతుండటంతో హౌజ్‌ లో అంత స్ట్రాంగ్‌ కంటెస్టెంట్సే ఉన్నారు. ప్రస్తుతం హౌజ్‌లో తనూజ, రీతు, కళ్యాణ్ పడాల, డిమోన్‌ పవన్‌, భరణి, దివ్య, సుమన్‌ శెట్టి, సంజనలు ఉన్నారు. వీరద్దరు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ మాత్రమే కాదు బలమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, పీఆర్‌ సపోర్టు కూడా ఉంది. ఈ పదకొండో వారం మొత్తం ఆరుగురు నామినేషన్‌లో వచ్చారు. ఇప్పటి వరకు రానీ, ఇమ్మాన్యుయేట్‌ తొలిసారి నామినేషన్‌లోకి వచ్చాడు. దీంతో ఓటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.

ఎలిమినేషన్‌పై ఉత్కంఠ

Advertisement

గత పదివారాలుగా ఇమ్మాన్యుయేల్‌ నామినేషన్‌లోకి రాకపోవడం.. అతడి ఫ్యాన్స్‌కి పెద్దగా పని లేకుండ పోయింది. ఇన్ని వారాల అభిమానాన్ని అంత ఈ ఒక్క వారంలోనే కురిపిస్తున్నారట. ఒట్లు వేయడమే కాదు కుప్పలు కుప్పలుగా మిస్స్డ్‌ కాల్స్‌ వస్తున్నాయట. దీంతో ఎప్పుడు టాప్‌లో ఉండ కళ్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌ మధ్య గట్ట పోటీ జరుగుతుంది. రోజురోజుకు ఓటింగ్‌లో డిఫరెన్స్‌ వస్తుండటంతో వీరిద్దరు కిందికి మీదకు వెళుతూ వస్తున్నారు. అయినా కళ్యాణ్‌ టాప్‌ ప్లేస్‌లోనే కొనసాగుతున్నాడట. నెక్ట్స్‌ ఇమ్మూ, ఆ తర్వాత డిమోన్‌, రీతూ, భరణి, సంజన, దివ్యలు ఉన్నారు. లీస్ట్‌ దివ్య, సంజనలే ఉండటంతో వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్‌ కాబోతున్నారు.

Also Read: The Raja Saab Pre Release: రాజా సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇక్కడ కాదు.. ఇండియన్‌ ఫ్యాన్స్‌ని మోసం చేస్తున్నారు భయ్యా

ఫైర్ బ్రాండ్‌ అవుట్

Advertisement

ఇక వీరిలో ఎక్కువగా దివ్య ఎలిమినేట్‌ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నవారిలో దివ్యకే ఎక్కువ నెగిటివిటీ ఉంది. దీనికి కారణం తనూజపై పర్సల్‌ గర్జ్‌, మరోవైపు భరణితో బాండింగ్. ఈ రెండు దివ్యకి తీవ్ర నెగిటివిటీని ఇస్తున్నాయి. ముందు నుంచి గొడవ అంటే చాలు ఫైర్‌ బ్రాండ్‌లా రెచ్చిపొతుంది. మాధురి తర్వాత అంత గొంతేసుకుని పడిపోయేది దివ్యనే. దీంతో ఆమె హౌజ్‌లో ఫైర్‌ బ్రాండ్‌ గుర్తింపు పొందిది. నిజానికి ఈ వారం సంజన బయటకు వెళ్లడానికి చాన్సస్‌ ఎక్కువ ఉండే. కానీ, నిన్న కెప్టెన్సీ టాస్క్‌ లో మరోసారి తనూజపై తన అక్కసు తీర్చు కుంది. అల్రేడీ కెప్టెన్‌, ఇమ్మ్యూనిటీ ఉన్న కారణం తనూజని కెప్టెన్సీ రేస్‌ నుంచి తొలగించేందుకు ఓటేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే భరణి తనూజతో క్లోజ్‌ ఉంటే చాలా కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది. ఇది దివ్యకు బయట ఫుల్‌ నెగిటివ్‌ అయ్యింది. ఆ కారణంగా ఆమె ఓట్లు తగ్గడంతో లీస్ట్‌లో చేరి ఈ వారం హౌజ్ వీడబోతుంది. ఇప్పటికే ఎలిమినేషన్‌ షూటింగ్ పూర్తయి దివ్య బయటకు వచ్చినట్టు కూడా టాక్‌ వినిపిస్తుంది. మరి దివ్య ఎలిమినేషన్‌పై క్లారిటీ రావాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×