Ram Director: రామ్ పోతినేని ..టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ఎనర్జీతో, డిఫరెంట్ పాత్రలతో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నఈ ఎనర్జిటిక్ స్టార్ తాజాగా చేసిన ఒక పని సినీ వర్గాల్లోనే కాకుండా నెట్టింట తెగ వైరల్ అవుతుంది.రీల్ హీరోలే కాదు, రియల్ హీరోలనిపించుకోవడంలో తామెప్పుడూ ముందుంటామని మరోసారి నిరూపించాడు రామ్.
వీరాభిమాని కల సాకారం
విషయంలోకి వెళ్తే గత 18 ఏళ్లుగా ‘ఫ్రీడ్రిచ్ అటాక్సియా’ అనే అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన నరాల సంబంధిత వ్యాధితో పోరాడుతున్న ఒక వీరాభిమాని కలని ఆయన సాకారం చేశారు. ఎప్పటికైనా తన అభిమాన హీరోను ఒక్కసారైనా చూడాలని, కలవాలని ఆరాటపడుతున్న ఆ అమ్మాయి పరిస్థితిని తెలుసుకున్న రామ్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఆమె ఇంటికే వెళ్లారు. ఆమెను ఎంతో అప్యాయంగా పలకరించి, ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్న ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇస్తూ రామ్ మాట్లాడిన మాటలు, చూపించిన ఆత్మీయతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అయితే ఈ ఎనర్జిటిక్ స్టార్ కేవలం నిజ జీవితంలోనే కాదు, రీల్ లైఫ్‌లోనూ సరికొత్త సంచలనం స్ప్రుష్టించేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటివరకు తెరపై తన యాక్టింగ్‌తో, డ్యాన్స్ లతో అలరించిన రామ్ పోతినేని, కెరీర్‌లో తొలిసారిగా మెగాఫోన్ పట్టబోతున్నాడు . అవును, హీరోగా నటిస్తూనే ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించనుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ పోతినేని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు వచ్చే నెలలోనే, అంటే 2026 జూన్ నెలలో అధికారికంగా సెట్స్ పైకి వెళ్లనుండటం విశేషం.
Also read :30 ఏళ్ల క్రితం చిరు ఇప్పుడు పవన్..‘మెగా 158’ వేడుకలో రివర్స్ అయిన సీన్.. వైరల్ అవుతోన్న ట్వీట్!
‘వీర’అనే సరికొత్త పాత్రలో కనిపించనున్న రామ్
అంతేకాదు, శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో, అంటే డిసెంబర్ 2026 నాటికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఇప్పటికే గట్టిగా ప్లాన్ చేసింది మూవీ టీమ్ .ఇక ఈ సినిమాలో రామ్ ‘వీర’ అనే విభిన్నమైన, మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం రామ్ పూర్తిగా తన లుక్‌ను మార్చేసుకున్నాడు కూడా.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.
డైరెక్టర్‌గా ఏ రేంజ్‌లో మెప్పిస్తాడో
గతంలో రామ్ నటించిన ‘దేవదాసు’ (2006) సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘రెడీ’, ‘కందురీగ’, ‘పాండగ చేస్కో’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లను అందుకున్నారు. ముఖ్యంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సినిమాతో మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించిన రామ్, డైరెక్టర్‌గా ఏ రేంజ్‌లో మెప్పిస్తాడో చూడాలి !
Also read :APSFTVTDC నూతన ఛైర్మన్‌గా భరత్ భూషణ్..ఏపీ కొత్త ఫిలిం కార్పొరేషన్ కమిటీ ఇదే!