E-Paper
Advertisement

జియో హాట్ స్టార్ లో చూడాల్సిన బెస్ట్ మూవీస్… వీటిలో ఒక్కటి చూసినా మస్త్ టైమ్ పాస్

జియో హాట్ స్టార్ లో చూడాల్సిన బెస్ట్ మూవీస్… వీటిలో ఒక్కటి చూసినా మస్త్ టైమ్ పాస్
Advertisement

Best JioHotstar Movies : ఒకప్పుడు సనీ ప్రపంచాన్ని థియేటర్లు ఏలితే, ఇప్పుడు మాత్రం ఓటీటీలు రాజ్యం ఏలుతున్నాయి. ఎలాంటి సినిమా అయినా ఇంట్లోనే చూసి ఎంటర్టైన్ అవుతున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు ఓటీటీలో రారాజుగా పేరు పొందింది జియో హాట్‌స్టార్ (JioHotstar). ఇందులో తెలుగుతో పాటు పిచ్చెక్కిపోయే హాలీవుడ్, రీజినల్ సినిమాలు ఉన్నాయి. వీటిని ఒకసారి చూసినా టైమ్ పాస్ గ్యారెంటీ. అంతేకాదు మళ్లీ మళ్లీ చూడాలనిపించే మ్యాటర్ ఉంటుంది వీటిలో. వీకెండ్ ఓ సారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. మరి ఆ తోపు సినిమాల పేర్లు ఏమిటో ఓ లుక్ వేద్దాం పదండి.

1. మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys)

ఇది కేరళలో జరిగిన రియల్ స్టోరీ. గుణ కేవ్స్ లోయలో పడిపోయిన తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి వీళ్లు చేసిన ఫైట్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. థియేటర్లలో 2024 ఫిబ్రవరి 22న రిలీజై, మలయాళంలో ₹200 కోట్లు కొల్లగొట్టిన మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఒక్క సారి చూస్తే తనివితీరేది కాదు.

2. అనోరా (Anora)

Advertisement

లాస్ట్ ఇయర్ ఆస్కార్ అవార్డుల్లో రచ్చ లేపిన సినిమా ఇది. ఒక రష్యన్ కోటీశ్వరుడి కొడుకు, ఒక వేశ్యని లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ల పేరెంట్స్ వచ్చి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయడానికి పడే తిప్పలు, కామెడీ, ఇంటెన్స్ డ్రామా మామూలుగా ఉండదు. 18 అక్టోబర్ 2024 న వరల్డ్ వైడ్ రిలీజైంది. అయితే బోల్డ్ కంటెంట్ కు ఆస్కార్ రావడం ఇక్కడ విశేషం.

3. ఒప్పెన్‌హైమర్ (Oppenheimer)

క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన విజువల్ వండర్ ఇది. ప్రపంచంలోనే మొదటి అటామిక్ బాంబ్ తయారు చేసిన సైంటిస్ట్ కథ. 21 జూలై 2023 న థియేటర్లలోకి వచ్చి దుమ్ములేపింది. బాంబ్ పేలే సీన్ లో వచ్చే సైలెన్స్, ఆ తర్వాత వచ్చే సౌండ్ కి థియేటర్లు ఊగిపోయాయి. పక్కాగా మళ్లీ మళ్లీ చూడాల్సిన సినిమా ఇది.

4. ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ (The Wolf of Wall Street)

Advertisement

పైసలు ఎట్లా సంపాదించాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి అనేదానికి కేరాఫ్ అడ్రస్ ఈ సినిమా. లకోటా షేర్ మార్కెట్ లో మోసాలు చేస్తూ కోట్లు సంపాదించిన జోర్డాన్ బెల్ఫోర్ట్ రియల్ లైఫ్ కథ ఇది. 2013 డిసెంబర్ 25 న రిలీజైన ఈ సినిమాలో బూతులు, ఎంజాయ్‌మెంట్ పీక్స్‌ లో ఉంటాయి.

5. ది డార్క్ నైట్ (The Dark Knight)

2008 జూలైలో వచ్చిన ఈ సినిమాని ఇప్పటికీ ఎవరూ కొట్టలేరు. బ్యాట్‌మ్యాన్ కంటే ఇందులో విలన్ ‘జోకర్’ క్యారెక్టర్ కి అందరూ ఫిదా అయిపోయారు. “వై సో సీరియస్?” అనే ఒక్క డైలాగ్ చాలు, ఇప్పటికీ మైండ్ లో తిరుగుతా ఉంటుంది.

6. షిండ్లర్స్ లిస్ట్ (Schindler’s List)

హిట్లర్ కాలంలో యూదులను చంపేస్తుంటే, ఒక బిజినెస్ మెన్ తన ఫ్యాక్టరీలో వాళ్లకు పని ఇస్తూ వందల మంది ప్రాణాలను కాపాడుతాడు ఇందులో. 1993 లో వచ్చిన ఈ సినిమాను చూస్తే కళ్లు చెమర్చడం గ్యారెంటీ.

7. ఫెంటాస్టిక్ మిస్టర్ ఫాక్స్ (Fantastic Mr. Fox)

కూల్ గా, ఫన్నీగా సాగిపోయే యానిమేషన్ సినిమా ఇది. 2009 న వచ్చిన ఈ మూవీలో ఒక తెలివైన నక్క, ముగ్గురు కరుడుగట్టిన దొంగల ముక్కు పిండి కోళ్లు, పండ్లు ఎట్లా దొంగిలించిందో భలే చూపిస్తారు. పిల్లలతో కలిసి మస్త్ టైమ్ పాస్ చేయొచ్చు ఈ సినిమాను చూస్తూ.

Read Also : సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్… హైవోల్టేజ్ యాక్షన్ తో సాగే మాస్టర్ పీస్ సిరీస్

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×