E-Paper
Advertisement

BJP Telangana: వచ్చే నెలలో తెలంగాణకు.. మరో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాక..!

BJP Telangana: వచ్చే నెలలో తెలంగాణకు.. మరో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాక..!
Advertisement

BJP Telangana: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో రాజకీయంగా మరింత పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా వచ్చే నెల మొదటి వారంలో పార్టీ జాతీయ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా, భవిష్యత్ కార్యాచరణను పటిష్టం చేసేలా ఈ పర్యటనలు సాగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని 10 జిల్లాల్లో బీజేపీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.

ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్..

అలాగే, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసేందుకు నిర్వహించబోయే కీలక ప్రశిక్షణ తరగతులకు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన బీజేపీ సీనియర్ నేత రాంచందర్ రావు.. జాతీయ నేతలను కలిసి తెలంగాణకు రావాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించారు. ఇదిలా ఉండగా ఈ పర్యటనల కంటే ముందే, రాష్ట్రంలో పార్టీ తాజా పరిణామాలపై చర్చించేందుకు శుక్రవారం బీజేపీ కీలక నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు.శుక్రవారం ఉదయం 9 గంటలకు రాంచందర్ రావు అధ్యక్షతన ఈ మీటింగ్ ప్రారంభంకానుంది. కాగా ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

Advertisement

Also Read: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి పై కేసు నమోదు..!

వ్యూహాలపై చర్చ జరిగే చాన్స్..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఈ భేటీలో పాల్గొననున్నారు. రాబోయే రోజుల్లో నిర్వహించాల్సిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల తేదీలు, వేదికల ఖరారుపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రజా సమస్యలపై పోరాటాలు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే వ్యూహాలపై చర్చ జరిగే చాన్స్ ఉంది. నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజలకు మరింత చేరువయ్యేలా వారి బాధ్యతలను నిర్దేశించడం అంటే పార్టీ భవిష్యత్ కార్యాచరణలో ప్రజాప్రతినిధుల పాత్ర అనే అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈనెల 10వ తేదీన ప్రధాని మోడీ తెలంగాణలో భారీ బహిరంగ సభను నిర్వహించగా వచ్చేనెలలో జాతీయ నేతల రాకతో తెలంగాణలో బీజేపీ శ్రేణులు మరింత క్రియాశీలకంగా మారే అవకాశం ఉంది.

Advertisement

Also Read: మెదక్ పర్యాటక అందాలపై రీల్స్ చేయండి: కలెక్టర్ ప్రతిమా సింగ్!

Related News

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

Big Stories

Advertisement
×