E-Paper
Advertisement

సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రామ్ పోతినేని కొత్త సినిమా.. పోస్టర్ చూస్తే మతి పోతుంది..

సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రామ్ పోతినేని కొత్త సినిమా.. పోస్టర్ చూస్తే మతి పోతుంది..
Advertisement

Ram Veera: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) తన తదుపరి చిత్రం గురించి ఒక క్రేజీ అప్‌డేట్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. #RAPO23 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నంచి హరో ‘వీర’ (VEERA) పాత్రను పరిచయం చేశారు. ఈ సినిమాతో రామ్ మొదటి సారి దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి హీరో పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ను చూస్తుంటే రామ్ ఇస్మాట్ శంకర్ యాక్షన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Read also-ఇళయరాజా మొదటి సినిమాకు 50 ఏళ్లు.. ‘మాస్ట్రో’ఎమోషనల్..

సినిమా నేపథ్యం

Advertisement

ఈ చిత్రానికి “The Story of a Lone Wolf” అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే, సమాజానికి దూరంగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిలో పోరాడే ఒక ఒంటరి పోరాట యోధుడి కథగా ఇది ఉండబోతోందని అర్థమవుతోంది. ఇది ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, మైండ్ గేమ్స్ ఎమోషనల్ డెప్త్ ఈ చిత్రంలో కీలకం కానున్నాయి. విశేషం ఏమిటంటే, ఈ చిత్రానికి కథ, కథనం అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా స్వయంగా రామ్ పోతినేని తీసుకున్నారు. కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రాపో సినిమాటిక్స్’ పతాకంపై ఈ భారీ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

Read also-టాలీవుడ్‌లో వివాదాలకు పరిష్కారమే లక్ష్యంగా ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం..

అభిమానుల్లో అంచనాలు

Advertisement

సాధారణంగా మాస్, కమర్షియల్ సినిమాలతో అలరించే రామ్, ఈసారి “సైకలాజికల్ థ్రిల్లర్” అనే కొత్త రూట్‌ను ఎంచుకోవడం విశేషం. టైటిల్ లోగో ‘లోన్ వోల్ఫ్’ అనే కాన్సెప్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా షూటింగ్ మరియు ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. రామ్ పోతినేని తన మేకోవర్‌ను ఈ సినిమా కోసం పూర్తిగా మార్చుకోబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీని కూడా అప్పడే ప్రకటించేశాడు. ఇదే ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×