E-Paper
Advertisement

ఇళయరాజా మొదటి సినిమాకు 50 ఏళ్లు.. ‘మాస్ట్రో’ఎమోషనల్..

ఇళయరాజా మొదటి సినిమాకు 50 ఏళ్లు.. ‘మాస్ట్రో’ఎమోషనల్..
Advertisement

Ilaiyaraaja Journey: భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ‘మాస్ట్రో’ ఇళయరాజా తన 50 ఏళ్ల సుదీర్ఘ సంగీత ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అన్నకిలి’ చిత్రంతో మొదలైన తన ప్రస్థానం నేటికి అరవై దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఆయన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు.

Read also-బుచ్చిబాబును కారులో రైడ్‌కి తీసుకెళ్లిన రామ్ చరణ్.. ‘పెద్ది’ ట్రైలర్‌పై మరింత క్లారిటీ..

ప్రేక్షకుల ప్రేమే నా బలం

Advertisement

అభిమానులు తనను ‘సంగీత దేవుడు’ అని పిలవడంపై స్పందిస్తూ.. “నేను ఎప్పుడూ నా పనిని దైవంగా భావించి నిజాయితీగా చేశాను. ప్రజలు నాలో దైవత్వాన్ని చూస్తున్నారంటే, అది నా సంగీతం వారి మనసులకు ఇస్తున్న ప్రశాంతతకు నిదర్శనం. వారు నన్ను అలా గౌరవించడం నాకు గర్వంగా ఉంది,” అని ఆయన పేర్కొన్నారు.

టేబుల్‌పై మొదలైన ప్రయాణం..

తొలి చిత్రం ‘అన్నకిలి’ (1976) అవకాశాన్ని గుర్తుచేసుకుంటూ.. నిర్మాత పంచూ అరుణాచలం తనను కలిసినప్పుడు తన వద్ద ఎలాంటి వాయిద్యాలు లేవని, కేవలం టేబుల్‌పై చేతులతో తడుతూ ఆయనకు ట్యూన్లు వినిపించానని ఇళయరాజా వెల్లడించారు. ఆ రాగాలకు ముగ్ధుడైన అరుణాచలం, ఆ పాటల ఆధారంగానే సినిమా కథను అల్లుకోవడం విశేషం.

Advertisement

Read also-హాలీవుడ్ లోకి నిఖిల్.. తెలుగు సినిమాలకు గుడ్ బై..?

భయం నుండి..

కెరీర్ ఆరంభంలో తన పరిస్థితి గురించి చెబుతూ.. “మొదటిసారి ఒంటరిగా సంగీత బాధ్యతలు చేపట్టినప్పుడు అడవిలో దారితప్పిన వాడిలా భయం వేసింది. కానీ, సంగీతమే నన్ను నడిపించింది. నేడు టెక్నాలజీ ఎంత మారినా, సంగీతంలోని ఆత్మ ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను రేపు లేకపోయినా నా సంగీతం ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది,” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఇళయరాజా, నేటికీ అదే ఉత్సాహంతో నూతన ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.\

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×