Janhvi Kapoor Body Double in Peddi: ఒకప్పుడు తన అందంతో అభినయంతో సౌత్ తో పాటు నార్త్..ని కూడా ఒక ఊపు ఊపేసింది అతిలోక సుందరి శ్రీదేవి. రాంగోపాల్ వర్మ వంటి దిగ్గజ దర్శకులు ఆమె అందానికి ఫిదా అయిపోయారు అంటే ఆమె గ్లామర్ రేంజ్ ఏంటనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆమె కుమార్తెగా సినిమాల్లోకి తెరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. ‘ధడక్’ తో హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చిన జాన్వీ.. ఆ సినిమాలో తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే చేసింది.
కానీ కమర్షియల్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. సాధారణంగా ముంబై హీరోయిన్లకి ఓ సెంటిమెంట్ ఉంటుంది. నార్త్ లో కనుక క్లిక్ అవ్వకపోతే వాళ్లకి బ్రేక్ ఇచ్చేందుకు సౌత్ ఫిలిం మేకర్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటారు అనేది ఆ సెంటిమెంట్. నార్త్ లో సీరియల్స్ లో నటించే మృణాల్ ఠాకూర్ వంటి భామలకు కూడా మన సౌత్ ఫిలిం మేకర్స్ బ్రేక్ ఇచ్చేందుకు రెడీగానే ఉంటారు. అదే జాన్వీకి కూడా పనికొస్తుందని అంతా నమ్మారు. అనుకున్నట్టుగానే ఆమెకు ‘దేవర’ రూపంలో మంచి డెబ్యూ లభించింది. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. కానీ ఆమెలోని నటితో కాకుండా గ్లామర్ తోనే మెప్పించే ప్రయత్నం చేసింది.
ఇక రామ్ చరణ్ ‘పెద్ది’ లో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు అచ్చియమ్మ అని ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ తో రివీల్ చేశారు. అలాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ గా రిలీజ్ చేసిన ‘చికిరి చికిరి’ అనే పాటలో కూడా జాన్వీ కపూర్ కనిపించింది. ఈ పాటలో రామ్ చరణ్ స్టెప్పులతో పాటు జాన్వీ గ్లామర్ కూడా చర్చనీయాంశం అయ్యింది. దర్శకుడు బుచ్చిబాబు సానా జాన్వీ పాత్రని చాలా వైవిధ్యంగా డిజైన్ చేశాడని టాక్. ఆమె గ్లామర్ గా కనిపిస్తున్నప్పటికీ.. పెర్ఫార్మన్స్ కూడా అదే రేంజ్లో ఉండబోతుంది అని వినికిడి. ఈ సినిమాతో జాన్వీ తెలుగు ప్రేక్షకులకి మరింత కొత్తగా కనిపిస్తుందట. ఇదిలా ఉంటే.. మరోవైపు ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ కి డూప్ గా ఓ టాలీవుడ్ నటి చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్.
Also Read: Varanasi Movie: గ్లోబ్ ట్రాటర్.. మహేష్ ఎంట్రీ వెనుక జక్కన్న కష్టం చూశారా? మేకింగ్ వీడియో వైరల్
ఆ నటి మరెవరో కాదండోయ్..! ‘మాసూద’ సినిమాలో దెయ్యంగా భయపెట్టిన బాంధవి శ్రీధర్ అట. అవును జాన్వీ కపూర్ హైట్ 5 అడుగుల 4 అంగుళాలట. బాంధవి కూడా అంతే హైట్ ఉంటుందట. వీళ్ళ లుక్స్ కూడా చూడటానికి చాలా వరకు సిమిలర్ గా ఉంటాయి. ‘పెద్ది’ లో చాలా ప్లేసుల్లో జాన్వీ బ్యాక్ షార్ట్స్ లో బాంధవి కనిపిస్తుందన్న మాట. జాన్వీ ఫ్లైట్ ఖర్చులు, హోటల్ రూమ్ ఖర్చులు, ఆమె టీం ఖర్చులు వంటివి సేవ్ చేసుకునేందుకు నిర్మాతలు బాంధవిని ఎంపిక చేసుకున్నట్టు అర్ధం చేసుకోవచ్చు. అన్నట్టు ఈమె కూడా సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించినట్టు చెబుతున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మార్చి 27న అంటే ‘పెద్ది’ రిలీజ్ రోజున తెలుస్తుంది.