E-Paper
Advertisement

Andhra King Taluka : 2002 బ్యాక్ డ్రాప్ తో ఆంధ్ర కింగ్.. పర్టికులర్ గా ఆ ఏడాదే ఎందుకంటే?

Andhra King Taluka : 2002 బ్యాక్ డ్రాప్ తో ఆంధ్ర కింగ్.. పర్టికులర్ గా ఆ ఏడాదే ఎందుకంటే?
Advertisement

Andhra King Taluka : మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ అంతా కూడా విపరీతంగా ఆకట్టుకుంది.

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ సినిమాలో సూర్య అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ కథ అంతా కూడా 2002 టైం లో జరుగుతుంది. ఆ టైం పిరియడ్లో ఈ కథను చెప్పడానికి రీసన్ ఏంటి అనేది దర్శకుడు మహేష్ బాబు రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రివిల్ చేశాడు.

2002 బ్యాక్ డ్రాప్ లో ఆంధ్ర కింగ్..

Advertisement

ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ, సినిమా జరిగేది 2002 కాలంలో, అప్పట్లో తుఫానులకు పేర్లు లేవు కానీ అప్పుడు ఒక తుఫాన్ వచ్చింది. నేను సరైన సంవత్సరాన్ని సినిమాలోని చూపించలేదు. అతని ఊరు అతని ప్రాంతం అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు దానికి తగ్గ కథ ఒకటి ఉంటుంది. పదేళ్ల క్రితం ఇది నేను అనుకున్న కథ. ఇప్పుడు ఏముంది? ఒక ఫ్యాన్ ని కలవాలి అంటే ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ పెడితే చాలు. కమ్యూనికేషన్ లేని రోజుల్లో, ఫోనులు లేని రోజుల్లో డ్రామా ఎక్కువగా ఉండేది.

ఒక మనిషి ఇంకొక మనిషిని కలవాలంటే మంచి డ్రామా ఉండేది. ఆ డ్రామా ఈ సినిమాకి సంబంధించి కావాలి అనిపించింది. ఒక స్టార్ బయలుదేరి వాడి అభిమానిని వెతుక్కుంటూ పోతుంటే, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీనిలో సూర్య అనేది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. ఉపేంద్ర గారి సినిమాలను వాడుకోకుండా, ఉపేంద్ర గారి సినిమాలను ఈ సినిమాలో క్రియేట్ చేసాం. ఉపేంద్ర గారు చెప్పే డైలాగులు బట్టి సూర్య ఎలా అట్రాక్ట్ అయ్యాడు అనేది ఈ సినిమాలో చూపిస్తాం.

Advertisement

దీనిలో ఉపేంద్ర గారి కాకుండా సూర్య అనే క్యారెక్టర్ కి ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఆ సూర్య అనే క్యారెక్టర్ లో అందరు హీరోలు కనిపిస్తుంటారు అమితాబచ్చన్, కమల్ హాసన్, చిరంజీవి , వెంకటేష్, నాగార్జున ఏ స్టార్ అయినా సూర్య అనే పాత్రను చూసి రిలేట్ చేసుకోవచ్చు.

స్టోరీ లైన్ ఆసక్తికరంగా ఉంది 

చూసిన కంటెంట్ అంతా సినిమా మీద నమ్మకాలను పెంచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు దర్శకుడు చెప్పిన ఈ లైన్ చూస్తుంటే ఇంకా ఆసక్తి పెరుగుతుంది. అతనికి ఈ సినిమాతో రామ్ పోతినేని బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటాడు అని చాలామంది అంచనా వేస్తున్నారు. ఒక సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో నవంబర్ 27న తెలుస్తుంది.

Also Read: Bigg Boss 9 Telugu: ఈ వీకెండ్ లో ఆ ముగ్గురికి రెడ్ కార్డు.. నాగ్‌తో చీవాట్లు తప్పవు

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×