Ram Pothineni : ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ పోతినేని ఊహించిన స్థాయి సక్సెస్ఫుల్ సినిమా అందుకోలేకపోయాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రమే ఆడాయి. బోయపాటి శ్రీను స్కంద సినిమాతో మాస్ కం బ్యాక్ ఇస్తాడు అనుకున్నాము కానీ అది వర్కౌట్ కాలేదు. ఇకపోతే రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రీసెంట్ గా విడుదలైంది.
ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా విపరీతమైన పాజిటివ్ టాక్ ఈ సినిమాకి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పుడు చిత్ర యూనిట్ స్పీడ్ పెంచుతుంది. ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ ప్రెస్ మీట్ నేడు నిర్వహించారు చిత్ర యూనిట్. రామ్ పోతినేని ,భాగ్యశ్రీ అమెరికాలో ప్రమోషన్ చేసిన తర్వాత ఇండియాకి ఎంట్రీ ఇచ్చారు. అందుకే వీరిద్దరూ కలిసి ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
రామ్ పోతినేని మాట్లాడుతూ నేను ఎక్కువగా ఆడియన్స్ ని రెస్పెక్ట్ చేస్తాను. నా సినిమా బాలేదు అని తెలిస్తే దానిని జనాల మీదకి నేను రుద్దను. తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాను హిట్ చేయడంలో ఫెయిల్ కాలేదు. ఈ మధ్యనే ఏదో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫీల్డ్ హియర్ అని వచ్చింది. సో అది ఈ సినిమాకి జరగదు.
ఎందుకంటే ఈ సినిమా పదిమంది చూస్తే వారిలో 9 మందికి నచ్చింది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే కేవలం పది మంది మాత్రమే సినిమా చూశారు. ఈ సినిమాని వందమంది చూస్తే 90 మందికి నచ్చుతుంది. 90 మంది చూస్తే ఖచ్చితంగా 80 మందికి నచ్చుతుంది. అందుకే ఈ సినిమాను ఇప్పటినుంచి ప్రమోట్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాం.
నేను ఈ సినిమా విషయంలో ముందే ఇది ఊహించను. ఎందుకంటే నేను విక్టరీ వెంకటేష్ గారు కలిసి మసాలా అనే సినిమా చేశాం. ఆ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు మాకు సాధారణంగా ఉండేంత ఓపెనింగ్స్ కూడా రాలేదు. అందుకే నాకు నవంబర్ నెల అంటే భయం.
ఈ సినిమా విడుదలైనప్పుడు ఫస్ట్ డే రికార్డు కొట్టేస్తాది ఇలాంటి అంచనా లేవీ మాకు లేవు. కానీ సినిమా పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్ లో మంచి అప్రిసేషన్ వస్తుంది అని ఊహించము.
అలానే మా సినిమా విషయంలో భాగ్యశ్రీ కూడా బాగా ప్రమోట్ చేశారు. మామూలుగా హీరోయిన్స్ ని ప్రమోషన్స్ కి రమ్మంటే ఏం చెబుతారు మా ప్రొడ్యూసర్ కి కూడా బాగా తెలుసు. కానీ ఈ అమ్మాయి మాత్రం సినిమా ప్రమోట్ చేయడానికి వెళుతున్నాను మీరు రావట్లేదా అనే టైపు. చాలా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత దొరికింది అని భాగ్యశ్రీ మీద కూడా ప్రశంసలు కురిపించాడు రామ్ పోతినేని.
Also Read: Archana Kalpathi : 9 నుంచి 5 గంటల వరకు షూటింగ్ అంటే కుదరని పని, దీపికాకు అర్చన స్ట్రాంగ్ కౌంటర్