E-Paper
Advertisement

Archana Kalpathi : 9 నుంచి 5 గంటల వరకు షూటింగ్ అంటే కుదరని పని, దీపికాకు అర్చన స్ట్రాంగ్ కౌంటర్

Archana Kalpathi : 9 నుంచి 5 గంటల వరకు షూటింగ్ అంటే కుదరని పని, దీపికాకు అర్చన స్ట్రాంగ్ కౌంటర్
Advertisement

Archana Kalpathi : తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో అర్చన కల్పాతి ఒకరు. వీళ్లు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన వీళ్ళు సినిమా నిర్మిస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ప్రదీప్ రంగనాథన్ చేసిన లవ్ టుడే సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాను ఈ సంస్థ నిర్మించారు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటించిన గోట్ సినిమా భారీ బడ్జెట్ తో ఈ సంస్థ నిర్మించింది. అలానే విజయ్ నటించిన బిగిల్ సినిమాని కూడా వీలు నిర్మించారు. ఇక రీసెంట్గా అర్చన రానా దగ్గుపాటి మరియు దుల్కర్ సల్మాన్ తో పాటు ఒక ప్రముఖ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఆ ఇంటర్వ్యూలో 9 గంటల నుంచి ఐదు గంటల వరకు పనిచేసే సినిమా వర్క్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తో దీపికాకి కూడా క్లారిటీ వచ్చేసినట్లే.

ఆ టైంలో షూటింగ్ అంటే జరగని పని 

Advertisement

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాలో మొదట దీపికా పదుకొనే హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వలన దీపిక ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. కేవలం తాను తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు మాత్రమే పని చేస్తాను అని దీపిక చెప్పడం వలనే ఈ సినిమా నుంచి తొలగించినట్లు సమాచారం వచ్చింది.

ఆ తర్వాత కల్కి సినిమా నుంచి కూడా దీపిక తప్పుకున్నారు. అయితే ఈ టైమింగ్స్ అనేవి తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై నిర్మాత అర్చన స్పందించారు. అర్చనా మాట్లాడుతూ 9 నుంచి 5 గంటల వరకు అనేది జరగని పని. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాల్ సీట్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సన్రైజ్ కాల్ షీట్ ఉంటుంది, ఇంకొన్ని సందర్భాల్లో సన్సెట్ కాల్ సీటు ఉంటుంది. ఆదివారం షూటింగ్ చేశాము అంటే కాల్ సీట్స్ కాస్ట్ డబల్ ఉంటాయి.

వడ్డీలు పెరిగిపోతాయి 

Advertisement

ఒక సినిమాకి సంబంధించి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు దానిలో కచ్చితంగా ఫినిష్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అలా ఫినిష్ చేయకపోతే చాలా ప్రాజెక్టులకి ఇంట్రెస్ట్ లు పెరిగిపోతాయి. మేము ప్రొడక్షన్ హౌస్ పరంగా కరెక్ట్ టైం కి శాలరీస్ ఇవ్వాలి. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఓటీటీల వలన. ఓటిటీ ప్లాట్ఫామ్స్ అనేవి రిలీజ్ డేట్ కరెక్ట్ గా పెట్టడం వల్ల షూటింగ్స్ కూడా పూర్తవుతున్నాయి అంటూ అర్చన రియాక్ట్ అయ్యారు. ఏదేమైనా అర్చన చెప్పిన పాయింట్స్ లో కూడా వాల్యుడ్ అని ఒప్పుకొని తీరాల్సిందే.

Also Read: Ram Pothineni : నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ఆ ప్రశ్న అడగండి, రిపోర్టర్ కు కౌంటర్ ఇచ్చిన రామ్ పోతినేని

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×