E-Paper
Advertisement

Champion first song : రోషన్ మేక ఛాంపియన్ సాంగ్ వచ్చేసింది, ఎలా ఉంది అంటే?

Champion first song : రోషన్ మేక ఛాంపియన్ సాంగ్ వచ్చేసింది, ఎలా ఉంది అంటే?
Advertisement

Champion first song : ఇండస్ట్రీలో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా కూడా కొంతమంది స్థానం వాళ్లకు ప్రత్యేకంగా ఉంటూనే ఉంటుంది. ఆ మ్యూజిక్ డైరెక్టర్లను పెద్దగా ఎవరు మ్యాచ్ చేయలేరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సాంగ్స్ ఇప్పటికీ కూడా చాలామంది పడుకుంటారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా మినహాయిస్తే వచ్చిన అన్ని సినిమాలకు సంగీతం అందించాడు మిక్కి.

మిక్కీ తెలుగులో చివరగా చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. కానీ ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక నటిస్తున్న ఛాంపియన్ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు మిక్కిజే మేయర్. ఈ సినిమాను వైజయంతి మూవీ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ బ్యానర్ లో మహానటి అనే సినిమాకి మిక్కి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే ఛాంపియన్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు.

ఫస్ట్ సింగిల్ టాక్ 

Advertisement

మిక్కీ టాలెంట్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గా విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో కూడా మిక్కీ కంపోజ్ చేసిన నిజంగా నేనేనా అనే పాటను రిఫరెన్స్ గా కూడా వాడారు.

ఇకపోతే ఛాంపియన్ మొదటి సాంగు కూడా బాగా ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ ఈ పాటను రచించారు. రామ్ మిరియాల ఈ పాటను పాడారు. రామ్ మిర్యాల ఒక పాట పాడారు అంటే తనకు ట్యూన్ నచ్చితే గాని పాడరు అనే టాక్ కూడా బయట ఉంది. లేదంటే తన ట్యూన్ తనే కంపోజ్ చేసుకుంటారు అని కూడా కొన్నిసార్లు వినిపిస్తుంది.

Advertisement

మొత్తానికి కొన్ని పాటలు వింటూ వింటూ ఉంటే ఎక్కుతాయి కానీ మరి కొన్ని పాటలు వినగానే ఆకర్షిస్తాయి. ఈ పాట అచ్చం అలానే ఉంది.

క్యూట్ పెయిర్ 

శ్రీకాంత్ కొడుకు రోషన్ ఎలా ఉంటాడు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ హృతిక్ రోషన్ అని కూడా తనని చాలామంది అంటుంటారు. కాకపోతే సరైన సబ్జెక్టు పడలేదు తనకి అని టాక్ కూడా వినిపిస్తుంది. ఛాంపియన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంటాడు అని అందరూ నమ్ముతున్నారు. భారీ స్థాయిలోనే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో మలయాళం హీరోయిన్ అనస్వర రాజన్ నటిస్తోంది. చంద్రకళ అనే పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈమెకు సంబంధించిన ప్రోమో వీడియోలో కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు ఈమె న్యూ క్రష్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Also Read : Naga Vamsi : తన కాంపౌండ్ డైరెక్టర్ కి మరో తమిళ్ హీరో సెట్ చేసిన నాగ వంశీ

Related News

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

Big Stories

Advertisement
×