E-Paper
Advertisement

రమణ గోగుల గుండు వెనుక రహస్యం ఏంటో తెలుసా..గొప్ప ప్రేమంటూ!

రమణ గోగుల గుండు వెనుక రహస్యం ఏంటో తెలుసా..గొప్ప ప్రేమంటూ!
Advertisement

Ramana Gogula: రమణ గోగుల పరిచయం అవసరం లేని పేరు. తన సంగీత స్వరాలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగీత దర్శకులలో ఈయన కూడా ఒకరు. సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా రమణ గోగుల (Ramana Gokula)అద్భుతమైన సింగర్ గా ఎన్నో సూపర్ హిట్ పాటలను ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు పైన పాట ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రమణ గోగులఈ పాటతో మరో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న ఈయనకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రమణ గోగుల ఎప్పుడు చూసినా గుండుతోనే కనిపిస్తుంటారు. ఇలా ఈయన గుండుతో కనిపించడానికి గల కారణాలు ఏంటి అంటూ ఎంతోమంది ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. మరి రమణ గోగులఎప్పుడు గుండుతో కనిపించడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే..

భార్య కోసం జీవితాంతం గుండుతోనే..

రవణ గోగుల గుండుతో కనిపించడానికి తన భార్య కారణమని తెలుస్తుంది. తన భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో తన డెలివరీ చాలా కష్టమవుతుందని డాక్టర్లు తనకు ముందుగానే చెప్పారట. దీంతో తన భార్య విషయంలో ఆందోళన చెందుతున్న రమణ గోగులకు తన టీమ్ లో ఒకరు తిరుపతికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకో అంటూ సలహా ఇచ్చారట. తన భార్య ఎలాంటి ప్రమాదం లేకుండా డెలివరీ కావాలని కోరుతూ ఈయన తిరుపతికి వెళ్లి అక్కడ తలనీలాలు సమర్పించి స్వామి వారికి మొక్కలు చెల్లించుకున్నారట.

ప్రమాదం నుంచి బయటపడిన రమణ గోగులభార్య..

Advertisement

ఈ విధంగా తిరుపతి వెళ్లి వచ్చినా తరువాత రమణ గోగుల భార్య చాలా సేఫ్ డెలివరీ అవ్వడంతో ఈయన తాను ఇకపై ఎప్పుడు గుండుతోనే కనిపించాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే రమణ గోగుల నిత్యం గుండుతోనే కనిపిస్తూ ఉంటారు. ఇలా ఈ ఘటన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జానీ సినిమా సమయంలో జరిగిందని తెలుస్తోంది. తాజాగా ఈ విషయం బయటపడటంతో రమణ గోగులకు తన భార్య అంటే ఎంత ప్రేమో స్పష్టమవుతుంది. ఇలా తన భార్య క్షేమం కోసమే ఈయన ఏ భర్త చేయకూడని పని చేశారని జీవితాంతం ఇలా గుండుతో కనిపించాలని మొక్కుకోవడం సాహసమే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ప్రేమంటే ఇదేరా సినిమాతో పరిచయం..

Advertisement

ఇక రమణ గోగుల విషయానికి వస్తే ఈయన ఎంటెక్ పూర్తి చేసినప్పటికీ సంగీతం పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.1996లో మిస్టీ రిథమ్స్ అనే బ్యాండ్ ద్వారా “అయే లైలా” అనే పాప్ ఆల్బమ్‌తో మ్యూజిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ ఆల్బమ్ విని ఫిదా అయిన దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, రమణ గోకులను ప్రేమంటే ఇదేరా సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా మొదటి సినిమాతోనే సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన అనంతరం బద్రి, జానీ, అన్నవరం, తమ్ముడు లాంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ తమిళ మలయాళ భాషలలో కూడా ఈయన సంగీత దర్శకుడిగా పనిచేశారు.

Also Read: నా ఓటు ఎవరో వేశారు..ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నటి!

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×