Akshaya Hariharan: తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన సంగతి తెలిసిందే. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగడంతో పెద్ద ఎత్తున సాధారణ ప్రజలతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుదూర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అలాగే ఇతర దేశాలలో షూటింగ్ పనుల నిమిత్తం బిజీగా ఉన్నవారు సైతం చెన్నై చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా పూర్తి అయ్యాయి. ఇకపోతే తాజాగా నటి అక్షయ హరిహరన్ కు మాత్రం చేదు అనుభవం ఎదురయింది. నేడు ఈమె తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.
తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లిన ఈమెకు పోలింగ్ అధికారులు అప్పటికే తన ఓటు వినియోగించబడిందని తెలియజేయడంతో ఈమె షాక్ అయ్యారు. అడయార్ లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఈమెకు అప్పుడే తన ఓటును వినియోగించుకున్నారని అక్కడ ఉన్న సిబ్బంది తెలియచేయడంతో తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె పేరుతో వేరొకరు వేలిముద్రను ఉపయోగించి ఓటు వేసినట్లు తెలిపారు. అయితే తన దగ్గర అన్ని ఐడి ప్రూఫ్స్ ఉన్నాయని, తనుకు ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరినప్పటికీ సిబ్బంది మాత్రం అంగీకరించకపోవడంతో ఈమె నిరాశ వ్యక్తం చేస్తూ వెను తిరిగారు.
ఈ విధంగా తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోవడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. తన ఓటు హక్కును ఇతరులు వినియోగించుకున్నట్టే ఇంకా ఎంతమంది ఓటు హక్కులను వినియోగించుకొని దొంగ ఓట్లు వేసి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. తన ఓటును వెంటనే రద్దు చేయాలని తన స్థానంలో ఓటు వేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ వ్యక్తం చేశారు. ఇలా తన ఓటు హక్కును ఇతరులు ఉపయోగించుకున్న నేపథ్యంలో ఈమె ఏకంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తన ఓటు హక్కు వినియోగించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఈమె ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రస్తుతం అక్షయ హరిహరన్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
@ECISVEEP please spread the news and cast your ballot tender vote if this is the case and cancel the fake vote with a complaint pic.twitter.com/eu5xkYB1k9
— akshaya hariharan (@akshaya__31) April 23, 2026
ఇక ఈ ఏడాది తమిళనాడులో జరిగిన ఈ ఎన్నికలు చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఈసారి నటుడు విజయ్ సైతం ఎన్నికల బరిలో దిగడంతో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. విజయ్ టీవీకే పార్టీని స్థాపించి మొదటిసారి ఎన్నికలలో పోటీ చేశారు. రాజకీయాలలో భాగంగా ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజలకు వరాల జల్లుల కురిపించారు. ఇలా ఒక సినీ నటుడు రాజకీయాలలోకి వచ్చి ఎన్నికలలో పోటీ చేసిన నేపథ్యంలో తమిళనాడు ఎన్నికల ఫలితాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: ఆ సీరియల్ కారణంగా మాతృత్వానికి దూరమైన బుల్లితెర నటి..అదే శాపంగా మారిందా?