E-Paper
Advertisement

యష్ రావణుడిగా మెప్పిస్తాడా లేక సైఫ్ అలీఖాన్ లా మిగిలిపోతాడా…నితేష్ తివారికి తిప్పలు తప్పవా?

యష్ రావణుడిగా మెప్పిస్తాడా లేక సైఫ్ అలీఖాన్ లా మిగిలిపోతాడా…నితేష్ తివారికి తిప్పలు తప్పవా?
Advertisement

Ramayana Teaser: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై పురాణ ఇతిహాసాలని తెరకెక్కించడం కొత్తేమీ కాదు.భీష్మ ప్రతిజ్ఞ నుండి మొన్నటి ఆది పురుష్ వరకు ఎన్నో సినిమాలు ఆడియన్స్ ని అలరించినవే. ఇక ఇదే క్రమంలో తెరకెక్కుతున్న నితేష్ తివారి దర్శకత్వంలో తెరక్కుతున్న రామాయణపై కూడా అంచనాలు భారీగానే పెట్టేసుకున్నారు మూవీ లవర్స్. ముఖ్యంగా ఇందులో సీతారాములుగా సాయి పల్లవి, రణ్ బీర్ కపూర్ నటిస్తుండటంతో ప్రాజెక్ట్ కాస్తా ప్రెస్టేజియస్ అయిపొయింది.దీనికి తోడు సినిమా బడ్జెట్ 4000 కోట్లని మేకర్స్ అనౌన్స్ చేయడంతో అసలంత బడ్జెట్ తో ఏం ప్లాన్ చేసుంటారా అన్న క్యూరియాసిటీ కూడా పెరిగిపోయింది.

ఈ  గ్రాఫిక్స్ ఏంట్రా బాబోయ్ ఇలా ఉంది

Advertisement

అంతా బాగానే ఉంది కాని తాజాగా వదిలిన రామాయణ పార్ట్ 1′ టీజర్‌ ని చూసే  ‘ఈ  గ్రాఫిక్స్ ఏంట్రా బాబోయ్ ఇలా ఉంది’ అంటూ పెదవి విరుస్తున్నారు మూవీ లవర్స్. ఒక వైపు అలా నెగిటివిటీ  తెగ చక్కర్లు కొడుతున్నా దర్శకుడు నితేష్ తివారి మాత్రం తను ఏదో విజువల్ వండర్ క్రియేట్ చేసినట్లు గాలిలో తేలిపోవడమే కాస్త ఆశ్చర్యం. పబ్లిక్ ఫీడ్ బ్యాక్ ఎలా ఉన్నా సరే, టీమ్ మొత్తం ఓ రేంజ్ లో  కాన్ఫిడెన్స్‌ చూపించడం చూస్తుంటే ఆడియన్స్ ని మేకర్స్ తక్కువ అంచనా వేస్తున్నారా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.

also read:నాగశౌర్య ఇక మారడా? ‘బ్యాడ్ బాయ్’తో సెల్ఫ్ గోల్.. కెరీర్ రిస్కులో పడ్డట్టేనా?

Advertisement

ఇది రాముడి సినిమానా లేక  రావణుడి భజననా 

ఇక ఇవన్ని ఇలా ఉంటె లేటెస్ట్ ఇంటర్వ్యూలలో నితేష్ తివారి ఇస్తున్న ఎలివేషన్లు చూస్తుంటే, ఇది రాముడి సినిమానా లేక రావణుడి భజననా అన్నట్టుగా ఉంది.ఈ సినిమాలో కన్నడ స్టార్ యష్ చేస్తున్న రావణుడి పాత్ర గురించి చెప్తూ.. అందులో నెగెటివ్ కంటే పాజిటివ్ ఎక్కువుంటుందని తెగ ఊరిస్తున్నాడు నితేష్.ముఖ్యంగా రావణుడు గొప్ప శివభక్తుడని, సంగీత విద్వాంసుడని, ప్రజలను అద్భుతంగా పాలించాడని తెగ డబ్బా కొట్టడం గమనార్హం.దీంతో సీతను అపహరించిన దుర్మార్గుడిని కూడా హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా? ఏంటని ఫైర్ అవుతున్నారు డివోటీస్. రామాయణం అని సినిమా తీస్తూ రావణుడిని ‘మంచివాడిగా’ చూపిస్తే ఎలా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ మాత్రమే

నిజానికి  రావణ బ్రహ్మ అంటే తెలుగు వారికి గుర్తొచ్చేది విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ మాత్రమే.ముఖ్యంగా’సీతారామ కళ్యాణం’, ‘భూకైలాస్’ సినిమాల్లో ఆయన చూపించిన గంభీరం, ఆ ఆహార్యం నబూతో న భవిష్యత్. ఇక ఎస్వీ రంగారావు ‘సంపూర్ణ రామాయణం’లో ఆ పాత్రకు ప్రాణం పోసిన వారె.అయితే వారి బాటలో నడవాలని ట్రై చేసి చేతులు కాల్చుకున్న వారు ఎందరో.మొన్నటికి మొన్న’ఆదిపురుష్’లో సైఫ్ అలీ ఖాన్ చేసిన విన్యాసాలు ఇప్పటికీ ఒక బ్యాడ్ డ్రీమ్‌లా వెంటాడుతున్నాయి కూడా. మరి ఇప్పుడు కేవలం ‘కేజీఎఫ్’ ఇమేజ్‌తో యష్ ఆ స్థాయిని అందుకోవడం సాధ్యమేనా అంటే అనుమానమే.

విజువల్‌గా ఆకట్టుకుంటుందా లేక మిస్ మ్యాచ్‌గా మారుతుందా

మరోవైపు సీతా రాములుగా నటిస్తున్న సాయి పల్లవి,రణబీర్ కపూర్ ల పక్కన యష్ రావణుడిగా నిలబడితే అది విజువల్‌గా ఆకట్టుకుంటుందా లేక మిస్ మ్యాచ్‌గా మారుతుందా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ . డైరెక్టర్  నితేష్ తివారి సినిమాలోని రోల్స్ గూర్చి ఎగ్జాగరేట్ చేస్తున్నాడు తప్ప టీజర్‌లో కనిపించిన నాసిరకం వీఎఫ్‌ఎక్స్ (VFX) గురించి మాత్రం మాట్లాడటం లేదు.సినిమాలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరింత హైలెట్ అవుతుందని ఆశ పడ్డా  కంటెంట్ లేకపోతే ఈ విజువల్ గ్రాండియర్ కాస్తా విజువల్ డిజాస్టర్‌గా మారే ప్రమాదం పుష్కలం. మరి రావణుడిని ఒక పాఠంలా చూపిస్తామంటున్న నితేష్ తివారి సక్సెస్ అవుతాడా లేక బోల్తా పడతాడా చూడాలి.

also read:అరాచకం అంటే ఇదేనా? బన్నీ-అట్లీ మూవీ టైటిల్ లీక్.. ఇన్ని వేషాలు ఎలా గురూ !

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×