E-Paper
Advertisement

అంకెల్లో తెలంగాణ జోరు.. అప్పుల్లో కేరళ తీరు, పినరయి విజయన్‌కు సీఎం రేవంత్ కౌంటర్

అంకెల్లో తెలంగాణ జోరు.. అప్పుల్లో కేరళ తీరు, పినరయి విజయన్‌కు సీఎం రేవంత్ కౌంటర్
Advertisement

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. విజయన్ రాసిన లేఖలోని భాషా శైలిని తప్పుబడుతూ రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానం ఇచ్చారు. రాజకీయ విమర్శల్లో సంస్కారం ఉండాలని హితవు పలికారు. విజయన్ వాడిన పదజాలం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తాను మాత్రం అనాగరిక పదజాలం జోలికి వెళ్లబోనని స్పష్టం చేశారు. మీరు తెలంగాణకు వస్తే అతిథి మర్యాదలు అందించడంలో వెనకాడబోనని రేవంత్ పేర్కొన్నారు.

కేరళ అభివృద్ధి దశాబ్దాల క్రితం నాటిదని రేవంత్ గుర్తు చేశారు. మీ ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఏమిటో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి కేవలం 28 నెలలే అయ్యింది. ఈ స్వల్ప కాలంలోనే రాష్ట్రం 10.1 శాతం జీఎస్డీపీ (GSDP) వృద్ధిని నమోదు చేసింది. జాతీయ సగటు 9.9 శాతాన్ని సైతం దాటేసింది. తలసరి ఆదాయం రూ.3.87 లక్షలకు చేరుకుంది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర సహా కేరళను కూడా తెలంగాణ వెనక్కి నెట్టిందని ఆర్బీఐ గణాంకాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

Advertisement

కేరళలో పేదరిక నిర్మూలన ప్రకటనలపై రేవంత్ రెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. 2025 నవంబర్ 1 నాటికి రాష్ట్రంలో పేదరికం పూర్తిగా తొలగిపోయిందని మీరు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే నేటికీ 64,006 కుటుంబాలకు మైక్రో ప్లాన్లు అమలు చేస్తుండటంపై వివరణ కోరారు. ఆ ప్రకటనను ఎవరైనా స్వతంత్ర సంస్థలు ధృవీకరించాయా అని నిలదీశారు. పేదరికం పోయిందని ట్వీట్లు చేయడం కాకుండా వాస్తవ పరిస్థితిని గమనించాలని సూచించారు.

అవినీతి రహిత పాలనపై విజయన్ చేస్తున్న వ్యాఖ్యలను రేవంత్ తిప్పికొట్టారు. సీఎం కార్యాలయంతో సంబంధం ఉన్న గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. శబరిమల ఆలయానికి చెందిన 4.5 కిలోల బంగారం మాయమైన ఉదంతంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేరళలో పరిపాలన పారదర్శకంగా ఉంటే ఈ అనుమానాలు ఎందుకు వస్తాయని నిలదీశారు.

Advertisement

తెలంగాణ భవిష్యత్తుపై రేవంత్ రెడ్డి స్పష్టమైన విజన్ ప్రకటించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఈ లక్ష్యానికి వెన్నెముకగా నిలుస్తాయని తెలిపారు. కేరళ ప్రజలు త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సాగిన ఈ లేఖల యుద్ధం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక గా మారింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొలిటికల్ గ్యాప్ మరింత పెరిగినట్లు కనిపిస్తోంది.

ALSO READ: బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×