E-Paper
Advertisement

బిల్డర్‌ని బెదిరించి బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా..!

బిల్డర్‌ని బెదిరించి బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా..!
Advertisement

BJP Corporator: స్వేచ్ఛ బ్యూరో: నిజామాబాద్​ నగర పాలక సంస్థ పరిధిలోని ఓ బీజేపీ కార్పొరేటర్​పై కేసు నమోదైంది. నగరంలోని లలితానగర్​కు చెందిన బిల్డర్​ గడ్డం ప్రసాద్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక బీజేపీ కార్పొరేటర్​ మఠం పవన్​పై ఐదో టౌన్​ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్​ఐఆర్​ నం. 62/2026, బీఎన్​ఎస్​ సెక్షన్​ 308(1) కింద కేసు నమోదు చేస్తూ ఈ నెల 6న ఎఫ్​ఐఆర్​ జారీ అయ్యింది.

డబ్బులు డిమాండ్..

ఎఫ్​ఐఆర్​లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు గడ్డం ప్రసాద్​ గత ఏడు సంవత్సరాలు బిల్డర్​గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అయోధ్యనగర్​లో వంద గజాల స్థలంలో ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. కాగా.. సంబంధిత ఇల్లు నిర్మాణానికి సంబంధించి మున్సిపల్​ కార్పొరేషన్​ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నప్పటికీ స్థానిక కార్పొరేటర్​ మఠం పవన్​, అతని అనుచరుడు వినోద్​ 15 రోజుల క్రితం తనను డబ్బులు డిమాండ్​ చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంటి పనులు నిలిపివేయిస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. దీంతో విచారణ జరిపిన ఐదో టౌన్​ పోలీసులు మఠం పవన్​తో పాటు అతని అనుచరుడు వినోద్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also read: హర్ష సాయి ఎక్కడ? గాలిలో దీపంలా ‘మెగా’ సినిమా.. రీల్ దేవుడి రియల్ భాగోతం ఇదేనా?

బీజేపీ కార్పొరేటర్​ పై కేసు నమోదు

నిజామాబాద్​ నగర పాలక సంస్థ పాలకవర్గం ఇటీవలే కొలువుదీరిన విషయం తెలిసిందే. తొలి సమావేశం జరిగి కూడా నెల రోజులు కాలేదు. అప్పుడే కార్పొరేటర్ల వసూళ్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ కార్పొరేటర్​పై కేసు నమోదు కావడం నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Also Read: పెద్ద మనుసు చాటుకున్న ఎంపీ మల్లు రవి.. ఏం చేశారంటే..?

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×