E-Paper
Advertisement

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో సీనియర్ నటుడు మృతి!

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో సీనియర్ నటుడు మృతి!
Advertisement

Tollywood: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు వరుసగా మరణించడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత పలువురు సెలబ్రిటీలు వివిధ కారణాలతో మరణించారు అయితే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రఘునాథ్ రెడ్డి(Raghunath Reddy) ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల సినిమాలలో తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన నేడు గుండెపోటు(Heart Attack) కారణంగా మరణించారు.

370 కి పైగా సినిమాలు..

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 370 కి పైగా సినిమాలలో నటించిన రఘునాథ్ రెడ్డి ఇకలేరనే వార్త తెలుగు చిత్ర పరిశ్రమను ఎంతగానో కృంగదీస్తోంది. ఈయన కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ బోజ్ పురి సినిమాలలో కూడా నటించినటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇక బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి రఘునాథ్ రెడ్డి బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఇలా వందల సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న ఈయన మరణ వార్త తెలిసిన అభిమానులు తోటి నటీనటులు షాక్ అవుతూ ఈయన మరణం పై స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

నెల రోజుల క్రితమే కొడుకు మరణం..

Advertisement

ఇకపోతే గత నెల రోజుల క్రితమే రఘునాథ్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఈయన కుమారుడు సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) నెల రోజుల క్రితమే గుండెపోటుతో మరణించారు. ఇలా కొడుకు మరణ వార్తను జీర్ణించుకోలేకపోయినా రఘునాథ్ రెడ్డి ఎంతో మానసికక్షోభ అనుభవించారు. ఇలా కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయిన రఘునాథ్ రెడ్డి కూడా గుండెపోటుతో మరణించటం బాధాకరం. ఇక ఈయనకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇలా నెలరోజుల వ్యవధిలోని ఈయన కుటుంబంలో రెండు విషాద ఘటనలు చోటు చేసుకోవడంతో నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

రఘునాథ్ రెడ్డి నటించిన సినిమాలు..

Advertisement

ఇక రఘునాథ్ రెడ్డి నటించిన సినిమాల విషయానికి వస్తే.. పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో శోభన్ బాబు హీరోగా నటించిన సర్పయాగం అనే సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. శీను, శ్రీమతి వెళ్ళొస్తా,పెళ్లి పందిరి, స్వయంవరం, కలెక్టర్ గారు, సంక్రాంతి, సైనికుడు, శ్రీరామరాజ్యం వంటి తదితర సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా వెండితెరపై బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన రఘునాథ్ రెడ్డి మరణ వార్త తెలిసిన అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.

Also Read: Ramcharan: కవలలు జన్మించడంపై చరణ్ ఎమోషనల్ పోస్ట్.. వారే మా బలం అంటూ!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×