E-Paper
Advertisement

బైకర్ సినిమా పై పెద్ది ప్రశంశలు.. స్నేహితుడి సక్సెస్ చూసి మురిసిపోయిన చరణ్

బైకర్ సినిమా పై పెద్ది ప్రశంశలు.. స్నేహితుడి సక్సెస్ చూసి మురిసిపోయిన చరణ్
Advertisement

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం పెద్ది సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా తన సినిమా పనులలో బిజీగా ఉంటూనే చరణ్ ఇతర సినిమాల గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సినిమా పట్ల తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తన ప్రాణ స్నేహితుడు శర్వానంద్ ఇటీవల నటించిన బైకర్ సినిమా గురించి ఈయన స్పందిస్తూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. బైకర్ సినిమా రేసింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3వ తేదీ విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.

నిర్మాతలకు హాట్సాఫ్…

ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు పెద్ద ఎత్తున ప్రశంశల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం బైకర్ సినిమా గురించి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. బైకర్ సినిమా గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను వింటున్నాను. బైకర్ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాంటి సరికొత్త కాన్సెప్టును ఎంపిక చేసుకొని, నిర్మాణ విషయంలో ఏ విధమైనటువంటి రాజీ లేకుండా విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన యూవీ క్రియేషన్ వారికి హ్యాట్సాఫ్ అంటూ పోస్ట్ చేశారు.

త్వరలోనే సినిమా చూస్తాను..

Advertisement

ఇక తన స్నేహితుడు శర్వానంద్ గురించి కూడా ఈ సందర్భంగా చరణ్ స్పందిస్తూ.. నా ప్రియమైన స్నేహితుడు శర్వానంద్ తన నటన నుంచి ఇలాంటి ప్రశంసలు అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే రాజశేఖర్ గారి పాత్రకు పాజిటివ్ టాక్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు . ఈ సినిమాని చాలా కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన డైరెక్టర్ అభిలాష్ రెడ్డి పై కూడా చరణ్ ప్రశంసలు కురిపించారు. ఇలా మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే చూడటానికి ప్రయత్నం చేస్తానంటూ చరణ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

ఈ పోస్ట్ పెట్టి చూస్తుంటే రామ్ చరణ్ ఇంకా ఈ సినిమా చూడలేదని స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఈయన పెద్ది సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ సినిమా చూడలేదని చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ విన్న చరణ్ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు ఈయన చేసిన పోస్ట్ పై నటుడు రాజశేఖర్ స్పందిస్తూ థాంక్యూ రాంచరణ్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక చరణ్ పెద్ది సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఒక పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదల అవుతుందా లేదా అనే అయోమయంలో అభిమానులు ఉన్నారు కానీ ఇప్పటివరకు మేకర్స్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Also Read: మంజుల డాక్టర్ బాబు కంటే సీనియర్ నా…తనతో పరిచయం, ప్రేమ పై ఓపెన్ అయిన నిరుపమ్ !

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×