E-Paper
Advertisement

రూ.20,000 బడ్జెట్‌లో రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్.. Note 15కి Note15 SEకి ఉన్న తేడా ఇదే!

రూ.20,000 బడ్జెట్‌లో రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్.. Note 15కి Note15 SEకి ఉన్న తేడా ఇదే!
Advertisement

Redmi Note 15 vs 15 SE: సామాన్యుల బడ్జెట్‌లో అత్యాధునిక ఫీచర్లను అందించే బ్రాండ్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది Redmi. ఇప్పటికే మార్కెట్లో సంచలనం సృష్టించిన Redmi Note 15 సిరీస్‌కు కొనసాగింపుగా, ఇప్పుడు Redmi Note 15 SE (స్పెషల్ ఎడిషన్) కూడా అందుబాటులోకి వచ్చేసింది. అయితే, ఈ రెండు ఫోన్లలో ఏది తీసుకోవాలి? తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఎందులో ఉన్నాయి? ఏది ఎక్కువ కాలం మన్నుతుంది? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఇప్పుడా డౌట్లకు చెక్ పెడుతూ.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షనో వివరంగా తెలుసుకుందాం.

ధరల విషయానికి వస్తే..

మామూలుగా కొత్త ఫోన్ రిలీజ్ అయినప్పుడు పాత మోడల్ రేట్లు తగ్గుతాయి కదా. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నోట్ 15 రేటు కొంచెం పెరిగి ఇప్పుడు రూ.24,999కి చేరింది. అదే కొత్తగా వచ్చిన SE మోడల్ అయితే రూ.19,999 నుంచే మొదలవుతుంది. దీంతో రూ.5,000 తక్కువలోనే ఈ సిరీస్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చన్నమాట. బడ్జెట్ తక్కువ ఉన్నవాళ్లకి ఇదొక బెటర్ ఆప్షన్.

Advertisement

Also Read: ఆరేళ్ల బ్యాటరీ వారంటీతో Honor X80i లాంచ్.. 1.8 మీటర్ల ఎత్తు నుంచి పడినా పగలదు!

లుక్ మారినా ఫీచర్లు అవే..

చూడటానికి ఈ రెండు ఫోన్లు ఒకేలా ఉంటాయి. బరువు గానీ, పట్టుకున్నప్పుడు వచ్చే ఫీల్ గానీ పెద్దగా తేడా ఏమీ ఉండదు. రెండింటిలోనూ 6.77 ఇంచుల కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. అయితే వీడియోలు చూస్తున్నప్పుడు స్క్రీన్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. అయితే SE మోడల్‌లో క్రిమ్సన్ రిజర్వ్ అనే కలర్ వేరియంట్ ఒకటి ఉంది. దీనికి వెనుక వైపు లెదర్ ఫినిషింగ్ వస్తుంది. ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలా కాస్ట్లీ ఫోన్ లాగా కనిపిస్తుంది.

కెమెరాలోనే అసలైన ట్విస్ట్..

Advertisement

రెడ్‌మీ నోట్ 15లో 108MP కెమెరా ఉంటుంది. పైగా వైడ్ ఫ్రేమ్ ఫొటోల కోసం అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంది. కానీ SE మోడల్‌లో మాత్రం 50MP కెమెరానే ఉంటుంది. దీనిలో అల్ట్రావైడ్ ఆప్షన్ లేదు. ఇక సెల్ఫీల విషయానికి వస్తే మాత్రం రెండింటిలోనూ 20MP ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇక ఫొటోల పిచ్చి ఉన్నవాళ్లయితే మాత్రం నోట్ 15 తీసుకోవడం ఉత్తమం.

బ్యాటరీలో ఏది బెస్ట్?

స్పీడ్ విషయంలో రెండింటిలోనూ ఒకే రకమైన స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ వాడారు. కాబట్టి గేమ్స్ ఆడినా, యాప్స్ వాడినా పెద్దగా తేడా తెలియదు. కానీ బ్యాటరీ దగ్గరకు వచ్చేసరికి SE మోడల్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే.. దీనిలో 5,800mAh పెద్ద బ్యాటరీ ఉంది. నోట్ 15లో ఇది కొంచెం తక్కువ. దీంతో ఒక్కసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే SE ఫోన్‌ను ఎక్కువ సేపు వాడుకోవచ్చు.

Also Read: 10x జూమ్, 200MP కెమెరాతో రానున్న Oppo Find X9 Ultra.. ఐఫోన్ కూడా దీని ముందు దిగదుడుపే!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×