E-Paper
Advertisement

మటన్ ముసుగులో గుర్రం మాంసం విక్రయం.. మంగళగిరిలో గుట్టురట్టు

మటన్ ముసుగులో గుర్రం మాంసం విక్రయం.. మంగళగిరిలో గుట్టురట్టు
Advertisement

Illegal Horse Meat Selling: అత్యాశకు హద్దులు ఉండవు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇప్పటికే చికెన్, మటన్ పేరుతో రకరకాల కల్తీ మాంసాలు మార్కెట్లోకి వస్తుండగా, ఇప్పుడు ఏకంగా గుర్రం మాంసం వంతు వచ్చింది. బాపట్ల జిల్లా నుండి గుర్రాలను తీసుకువచ్చి, మంగళగిరి సమీపంలోని మంగమూరి రోడ్డు శివార్లలో వాటిని వధించి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

గుర్రం మాంసాన్ని గొర్రె మాంసంగా విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు ఛేదించి, రెండు గుర్రాలతో పాటు నాలుగు ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

నిందితులు బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లి ప్రాంతం నుండి గుర్రాలు, గాడిదల మధ్య క్రాస్ బ్రీడింగ్ ద్వారా పుట్టిన జీవాలను తక్కువ ధరకు సేకరిస్తున్నట్లు విచారణలో తేలింది. వీటిని గాడిద మాంసంగా లేదా మటన్‌గా నమ్మించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. అసలు గుర్రం మాంసం అమ్మాలన్న దుర్మార్గపు ఆలోచన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అధిక లాభం. గుర్రాలు సాధారణంగా చికెన్, మటన్ కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ముఖ్యంగా ముసలివి లేదా పనికిరాని గుర్రాలను కబేళాలకు తరలించి, వాటి మాంసాన్ని ఇతర మాంసాలతో కలిపి కల్తీ చేయడం ద్వారా నిందితులు అక్రమంగా సంపాదిస్తున్నారు.

గుర్రం మాంసం తింటే గుర్రంలా బలం వస్తుందని లేదా వేగంగా పరిగెడతారని కొందరు చేస్తున్న ప్రచారం కేవలం మూఢనమ్మకం. నిందితులు ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తూ అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. శాస్త్రీయంగా చూస్తే, గుర్రం మాంసంలో ప్రోటీన్ ఉన్నప్పటికీ, అది మనిషికి గుర్రపు సామర్థ్యాన్ని ఇచ్చే శక్తి లేదు. పైగా ఇలాంటి అనాధికారిక వధశాలల నుండి వచ్చే మాంసం పరిశుభ్రంగా ఉండదు, దీనివల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

పట్టుబడిన నిందితులు పోలీసుల విచారణలో “తమకు తక్కువ ధరకు మాంసం దొరకడం వల్లే ఇలా చేస్తున్నామని” చెబుతుండగా, పోలీసులు మాత్రం దీని వెనుక ఇంకా పెద్ద ముఠా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు కూడా మాంసం కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరకు వస్తోంది కదా అని ఇలాంటి నకిలీ మాంసాలను కొని అనారోగ్యం పాలు కావద్దని అధికారులు కోరుతున్నారు.

Read Also: హనుమకొండలో ఘోరం.. మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి!

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×