E-Paper
Advertisement

పెద్ది వాయిదా పై చరణ్ క్లారిటీ.. లేట్ అవ్వట్లేదు కొంచం ప్రమోట్ చేయండంటూ!

పెద్ది వాయిదా పై చరణ్ క్లారిటీ.. లేట్ అవ్వట్లేదు కొంచం ప్రమోట్ చేయండంటూ!
Advertisement

Ramcharan: మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ (Ramcharan Tej)ప్రస్తుతం పెద్ది సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్లో ఉంది. మరి కొన్ని రోజులలో షూటింగ్ పూర్తికాగా ఈ సినిమాని ఏప్రిల్ 30వ తేదీ విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదల కావడం లేదని జూన్ 26వ తేదీ విడుదల కాబోతోంది అంటూ వార్తలు రావడంతో అభిమానులు అయోమయంలో ఉన్నారు. అదేవిధంగా పెద్ద సినిమా విడుదల గురించి క్లారిటీ వస్తే తదుపరి సినిమాలో విడుదలపై కూడా స్పష్టత వస్తుందని ఈ సినిమా విడుదల తేదీ గురించి ఇతర చిత్ర నిర్మాతలు కూడా ఎదురు చూస్తున్నారు.

చెల్లెలి కోసం తరలివచ్చిన అన్నయ్య..

ఈ సినిమా జూన్ 26 తేదీ విడుదల కాబోతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ ఈ వార్తలపై పరోక్షంగా స్పందించారు. రామ్ చరణ్ తాజాగా తన చెల్లెలు నిహారిక (Niharika)నిర్మాతగా వ్యవహరిస్తున్న రాకాసా(Raakaasaa) సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ కూడా చిత్ర బృందంతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా పెద్ది (Peddi)సినిమా గురించి కూడా ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది.

పెద్ది లేట్ అవ్వట్లేదు..

Advertisement

పెద్ది సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, అందరికీ ఎగ్జామ్స్ అయిపోతాయి ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేస్తారని, అయితే పెద్ది సినిమా లేట్ అవ్వట్లేదు, ఈ విషయాన్ని ప్రమోట్ చేయండి అంటూ చరణ్ రాకాస చిత్ర బృందంతో ఈ విషయాన్ని తెలియచేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా వాయిదా పడకుండా యధావిధిగా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అభిమానులు భావిస్తున్నారు. ఇలా పరోక్షంగా చరణ్ పెద్ది సినిమా వాయిదా పడలేదు అంటూ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఏప్రిల్ 2న ప్రీమియర్లు ప్రసారం..

Advertisement

ఇక ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో త్వరలోనే రాబోతుంది ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాంచరణ్ పెద్ది సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలను మాట్లాడారనేది తెలియనుంది. ఇక రాకాస సినిమా గురించి కూడా చరణ్ మాట్లాడుతూ స్నేక్ సాంగ్ చాలా బాగుంది అంటూ ప్రశంసించారు. ఇక రాకాస సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఫాంటసీ హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించగా, సంగీత్ శోభన్ నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ విడుదల కాబోతుండగా ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి.

Also Read: రామాయణ సినిమా రిజెక్ట్ చేసిన రణబీర్ కపూర్… ఆ ఒక్క కారణంతోనే సినిమా చేశాడా?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×