E-Paper
Advertisement

రైల్లో టాయిలెట్ దగ్గర పడుకున్న జవాన్లు, టీసీ ఏం చేశాడంటే?

రైల్లో టాయిలెట్ దగ్గర పడుకున్న జవాన్లు, టీసీ ఏం చేశాడంటే?
Advertisement

Real Respect in Action: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిన్న వీడియో ఎంతో మంది మనసును ఆకట్టుకుంటుంది. ఇందులో అసలు ఏం ఉంది? ఎందుకు అంత వైరల్ అవుతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ వీడియోలో ఏం ఉందంటే?

ఈ వైరల్ వీడియోలో ఇద్దరు CRPF జవాన్లు రైల్లోని టాయిలెట్ దగ్గర పడుకుని ఉన్నారు. వాళ్లు బాగా అలసిపోవడం వల్ల అక్కడే ఆదమరిచి నిద్రపోతున్నారు. ఇద్దరూ అలసటలో మునిగిపోయారు. గంటల తరబడి డ్యూటీ చేసిన బాగా అలసి నిద్రపోతూ కనిపించారు. రైల్లో సీట్లు లేకపోవడంతో కిందే పడుకున్నారు. విశ్రాంతి కోసం కాకుండా, కేవలం అలసటను తీర్చుకునేందుకు అలా ఫ్లోర్ మీదే పడుకున్నారు. టికెట్ చెకింగ్ కోసం వచ్చిన టికెట్ ఎగ్జామినర్ జితేంద్ర మిశ్రా రైలు వాష్ రూమ్ దగ్గర పడుకున్న జవాన్లు చూశాడు.

టీసీ చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు

Advertisement

వారిని చూడగానే టీసీ మనసు కలచివేసినట్లు అయ్యింది. వెంటనే వారిని నిద్రలేపాడు. వారు బాగా అలసిపోయి ఉన్నట్లు గుర్తించి, వారికి సీట్లు ఏర్పాటు చేశాడు. వాళ్లను అక్కడ పడుకోమని చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తీసి టీసీ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. నిజానికి ఆయన చేసింది చిన్న పనే అయినా, అందరి మనసులను తాకింది. ఎందుకంటే, ఈ వీడియోలో టీసీ జవాన్లతో ప్రవర్తించిన తీరు అత్యంత మర్యాదగా ఉంది. ఒక టీసీగా కేవలం తను వారికి చిన్న సాయం చేస్తున్నట్లు ఫీలయ్యాడు. కానీ, ఈ వీడియో కాసేపట్లోనే నెట్టింట బాగా వైరల్ అయ్యింది.

Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, ఏపీ మీదుగా వీక్లీ స్పెషల్ రైళ్లు!

Advertisement

నిజానికి ఈ వీడియోలో జవాన్లు ఆయనను ఎలాంటి సాయం అడగలేదు. సీట్లు ఇప్పించాలని కోరలేదు. కానీ, వారి బాధను అర్థం చేసుకుని ఆయనే వారికి సీట్లు ఇప్పించాడు. కొద్ది సెకెన్ల పాటు ఉన్న ఈ వీడియో నెటిజన్లు బాగా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటే, ఇలాంటి సందర్భాల్లో టీసీ, జవాన్ల గురించి ఆగి ఆలోచించడాన్ని ప్రశంసిస్తున్నారు. పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. చిన్న పని అయినా, మనస్ఫూర్తిగా చేస్తే, ప్రజల మనసులను ఆకట్టుకుంటుందని నిరూపించాడు ఆ రైల్వే టీసీ. నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Read Also: ప్రయాణికులకు షాక్.. 10 ఎక్స్ ప్రెస్, 4 ప్యాసింజర్ రైళ్ల రద్దు!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×