E-Paper
Advertisement

మోదీ, పినరయి ఇద్దరూ ఒక్కటే.. కేర‌ళ‌లో కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపు

మోదీ, పినరయి ఇద్దరూ ఒక్కటే.. కేర‌ళ‌లో కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపు
Advertisement

Revanth Reddy Kerala Roadshow: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకున్న తరుణంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం ముట్టతారలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇద్దరూ ఒకే నాణేనికి రెండు ముఖాలని విమర్శించారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ (UDF) కూటమిని అడ్డుకోవడానికి బీజేపీ ఎల్‌డిఎఫ్ (LDF) లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని ఆయన ఆరోపించారు.

కేరళలో కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలవకూడదనే ఏకైక లక్ష్యంతో మోదీ, పినరయి విజయన్ కలిసి పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. “కేరళ భవిష్యత్తును నాశనం చేయాలని ఈ ఇద్దరు నేతలు చూస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకును పినరయి విజయన్ నాయకత్వంలోని లెఫ్ట్ కూటమికి బదిలీ అయ్యేలా మోదీ ప్రయత్నిస్తున్నారు.” అని రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. ఇద్దరు నేతల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నట్లు నటించినా, తెర వెనుక మాత్రం కాంగ్రెస్‌ను దెబ్బతీయడమే వీరి ప్రధాన అజెండా అని విమర్శించారు.

Advertisement

కేరళ ప్రజలు దేశంలోనే అత్యంత విద్యావంతులు, తెలివైనవారని రేవంత్ రెడ్డి కొనియాడారు. “ఇక్కడి ప్రజలు మతతత్వ శక్తులను ఎప్పుడూ అనుమతించలేదు. అలాంటి శక్తులు అధికారంలోకి రాకుండా కేరళ ప్రజలు ఒక లక్ష్మణరేఖ గీశారు. ఆ గీతను దాటి బీజేపీ ఇక్కడ అడుగుపెట్టలేదు.” అని అన్నారు. మతసామరస్యానికి నిలయమైన కేరళలో విభజన రాజకీయాలు చెల్లవని, విద్యావంతులైన ఓటర్లు మోదీ మాయమాటలను నమ్మరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కేరళ భవిష్యత్తును కాపాడుకోవాలంటే కాంగ్రెస్ మిత్రపక్షాలను భారీ మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఒకవైపు కేంద్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ, మరోవైపు రాష్ట్రంలో నియంతృత్వ పోకడలు అనుసరిస్తున్న లెఫ్ట్ ప్రభుత్వం మధ్య కేరళ నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవాలని, కేరళలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి రాకతో కేరళ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కేర‌ళ ఎన్నిక‌ల‌ ప్రచారంలో భాగంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారితో క‌లిసి అలెప్పి జిల్లా క‌యంకుళం అసెంబ్లీ నియోజ‌క‌వర్గంలో జ‌రిగిన రోడ్ షోలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Read Also: చండీగఢ్‌ BJP కార్యాలయం వద్ద పేలుడు..పార్క్‌ చేసి ఉంచిన స్కూటీలో పేలుడు

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×