E-Paper
Advertisement

Varanasi: వారణాసి నుంచి మరో సర్ ప్రైజ్.. ‘ రణ కుంభ’ ఆడియో సాంగ్ రిలీజ్!

Varanasi: వారణాసి నుంచి మరో సర్ ప్రైజ్.. ‘ రణ కుంభ’ ఆడియో సాంగ్ రిలీజ్!
Advertisement

Varanasi: రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వారణాసి(Varanasi). ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి గ్లోబ్ ట్రాటర్ పేరిట పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు మహేష్ బాబు పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం నుంచి సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ బయటకు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి సంచారి అనే పాటను విడుదల చేయగా ఈ పాటకు అద్భుతమైన ఆదరణ లభించింది.

రణ కుంభ సాంగ్ రిలీజ్..

ఇకపోతే తాజాగా రాజమౌళి ఎలాంటి ప్రకటన చేయకుండా ఈ సినిమా నుంచి మరొక సర్ ప్రైస్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ” రణ కుంభ”(Rana Kumbha) అనే పాటను విడుదల చేయడంతో ఈ పాట కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “ప్రళయం.. ప్రళయం”అంటూ సాగిపోయే ఈ పాటను సింగర్ ఆదిత్య అయ్యంగర్ ఎంతో అద్భుతంగా ఆలపించగా, ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. కీరవాణి సంగీత సారథ్యంలో ఈ పాట ఎంతో అద్భుతంగా వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం రణ కుంభ అనే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పాట మొత్తం పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రను ఎలివేట్ చేస్తూ ఉండబోతుందని స్పష్టమవుతుంది.

రుద్ర పాత్రలో మహేష్ బాబు..

Advertisement

ఇక ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ పనులను జరుపుకుంటుందని సమాచారం. ఇలా ఒకవైపు షూటింగ్ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు చిత్ర బృందం గ్లోబల్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ పలు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా కనిపించబోతున్నట్లు స్వయంగా రాజమౌళి వెల్లడించారు. మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించగా ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపించనున్నారు.

Advertisement

ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి రాజమౌళి నిత్యం వివాదాలలో నిలుస్తూనే ఉన్నారు. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ప్రకటించడంతో రాజమౌళి పై ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇదివరకే రామభక్త హనుమ అనే నిర్మాణ సంస్థ వారణాసి టైటిల్ రిజిస్టర్ చేయించుకోవడమే కాకుండా అధికారికంగా పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇలా తమ సినిమా పోస్టర్ విడుదలైనా, రాజమౌళి ఎలాంటి అనుమతి లేకుండా తన సినిమాకు వారణాసి అనే టైటిల్ ప్రకటించడంతో కేసు నమోదు చేశారు. అలాగే గ్లోబ్ ట్రాటర్ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి నాకు దేవుడిపై నమ్మకం లేదు అంటూ మాట్లాడిన వ్యాఖ్యల పట్ల కూడా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై హిందూ సంఘాలు రాజమౌళి వ్యాఖ్యలను ఖండిస్తూ తనపై కేసులు నమోదు చేయటంతో రాజమౌళి వివాదంలో నిలిచారు. అయితే ఇప్పటివరకు ఈయన ఈ వివాదంపై ఎక్కడ స్పందించలేదు.

Also Read: Drushyam 3: దృశ్యం3 కి లైన్ క్లియర్… రెగ్యులర్ షూటింగ్ అప్పుడే ప్రారంభం!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×