యువకులు చేసే పనులు రోజు రోజుకు మరింత మితి మీరుతున్నాయి. తాజాగా ఓ కుర్రాడు ఏకంగా కారు పైకి ఎక్కి తన ప్రియురాలికి ముద్దులు పెట్టాడు. ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే సాకేత్ జె బ్లాక్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ 20 ఏళ్ల కుర్రాడు చేసిన ఈ పనిని చూసి అందరూ షాకవుతున్నారు. పక్కనే ఉన్న కారులోని వ్యక్తులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫుటేజ్ లో ఆ యువకుడు కదులుతున్న కారు పైకప్పుపైకి ఎక్కి థ్రిల్ ను ఆస్వాదించాడు. అంతేకాదు, కొంత దూరం వెళ్లగానే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగింది. ఆ సమయంలో కారు లోపలి నుంచి ఓ యువతి తల బయటకు పెట్టింది. కారు పైన ఉన్న యువకుడు ఆమెకు ముద్దు పెట్టడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సిగ్నల్ దగ్గర తోటి వాహనదారులు అంతా వారిని చూస్తూ ఉండిపోయారు.
ఇక ఈ వీడియో షూట్ చేస్తున్న వ్యక్తులు, సదరు యువకుడికి కేవలం 20 నుంచి 21 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉంటుందన్నారు. అతడికి ఏదైనా జరిగితే, కుటుంబం నాశనం అవుతుందంటారు. 30 సంవత్సరాల వయస్సులో ఉన్నా, తాను టైమ్ కు ఇంటికి వెళ్లకపోతే ఇంటి నుంచి కాల్ వస్తుందని, ఇలాంటి పనులు చేసే కుర్రాళ్లకు ఎప్పుడు ఏం జరుగుతుందో? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరాడు.
ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. మోటారు వాహన చట్టం (MVA)లోని సెక్షన్లు 179, 184 కింద జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు తమ అధికారిక X పేజీలో ఈ వీడియో షేర్ చేస్తూ, “జీవితం చాలా విలువైనది. పై కేసులో నిందితుడికి MVA సెక్షన్ 179, 184 కింద జరిమానా విధించబడింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా తమ ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం” అని చెప్పుకొచ్చారు.
మరోవైపు ఈ కారు మీద ఇప్పటికే బోలెడు చలాన్లు పెండింగ్ లో ఉన్నాయని ఒక వినియోగదారుడు కామెంట్ పెట్టాడు. కారుకు విధించిన ఫైన్లకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేశాడు. వీటిలో మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 112/183 కింద అతివేగంగా డ్రైవింగ్ చేసినందుకు పలు జరిమానాలు ఉన్నాయి. సెక్షన్ 122/177 కింద నిషేధిత ప్రాంతంలో పార్కింగ్‌కు జరిమానా విధించారు. సెక్షన్ 179 కింద ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు. సీటు బెల్టు లేకుండా డ్రైవింగ్ చేసినందుకు, సీటు బెల్టు ధరించని ప్రయాణీకుడిని తీసుకెళ్లినందుకు సెక్షన్ 194B(1) కింద చలాన్ కూడా ఈ లిస్టులో ఉంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Usual Day in Delhi Location – Saket J-block pic.twitter.com/yTuXO6hkUh
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 18, 2025
Read Also:హార్న్ కొడితే.. రెడ్ సిగ్నల్ సమయం పెరిగిపొద్ది.. ముంబయి పోలీసుల సరికొత్త ఆలోచన!