Hero Rana : టాలీవుడ్ యంగ్ హీరో రానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సరే మొదటి సినిమాతోనే తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు రానా.. బాహుబలి లాంటి సినిమాలలో ప్రత్యేక పాత్రలో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.. ఈ మూవీ అతనికి మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ప్రస్తుతం అడపా దడప సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు కానీ ఏ సినిమా కూడా బాహుబలి అంత ఇమేజ్ ని అందించలేదు.. సినిమాల సంగతి పక్కన పెడితే రానా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న హీరోలలో రానా ఒకడు. ఒకవైపు హీరోగా మాత్రమే కాదు మరోవైపు నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. అంతే కాదు పలు స్పెషల్ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ తన టాలెంట్ తో జనాలని మెప్పిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రానా మల్టీ టాలెంటెడ్. ఇదంతా పక్కన పెడితే రానా ఫుడ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నిజానికి రానా ఫుడ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు అన్న విషయం గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా రానా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా తన ఫుడ్ గురించి షాకింగ్ విషయాలను పంచుకున్నారు. నేను ఫుల్ మీట్ ఈటర్. ఏ దేశానికి వెళ్లినా అక్కడ దొరికే లోకల్ ఫుడ్ కచ్చితంగా టేస్ట్ చేస్తాను. మీరు భయపడే వాటిని నేను తిన్నాను.. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ స్పెషల్ గా ఉండే ప్రతి ఐటమ్ మీరు ట్రై చేస్తాను అని రానా నిర్మొహమాటంగా చెప్పడంతో జనాలు ఒక్కసారిగా భయానికి గురయ్యారు. రానా ఇలా ఫుడ్ ని తీసుకుంటాడని అస్సలు ఊహించి ఉండరు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో రానా లీడర్ మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఈయన ఇప్పటివరకు నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. బాహుబలి సినిమాలో బల్లాలదేవగా ఆయన నటించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ మూవీ తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా పర్వాలేదు అనిపించాయి. గతంలో వచ్చిన దుల్కర్ సల్మాన్ కాంతకు నిర్మాత గా వ్యవహరించడంతో పాటుగా అందులో కీలక పాత్రలో కూడా నటించాడు.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’లో రానా ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.. భారీ విజువల్ వండర్ గా తెరకెక్కిన ఏ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటుగా రానా మరికొన్ని చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు..