E-Paper
Advertisement

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!
Advertisement

Ranabaali Movie:‘రణబాలి’..విజయ్ దేవరకొండ,రష్మిక కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో సాలిడ్ వసూల్లని కొల్లగొడుతున్న సంగతి తెల్సిందే. ఇక సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సినీ సెలెబ్రిటీస్.

ఇందులో భాగంగా ఈ సినిమాలో విజయ్ యాక్షన్ చూసి ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఫిదా అయ్యారు. ఆయన విజయ్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఇక ఇదే పోస్ట్ కి రియాక్ట్ అయ్యారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా రియాక్ట్ అవుతూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

విజయ్ దేవరకొండ యాక్షన్ గురించి సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. విజయ్ చేసే ఫైట్స్‌లో ఒక రకమైన సహజమైన కోపం, ఆవేశం కనిపిస్తున్నాయని మెచ్చుకున్నారు.విజయ్ చేసిన యాక్షన్‌ చాలా న్యాచురల్ గా ఉందని,పైగా అందులో ఒక ఇంటెన్సిటీ కూడా ఉందని ప్రశంసలు కురిపించారు.అంతేకాదు,ఇండియన్ సినిమాలో ఒక గొప్ప యాక్షన్ హీరోగా విజయ్ దేవరకొండ నిలుస్తాడని తనకు గట్టి నమ్మకం ఉందంటూ అభినందనలు తెలిపారు.ఇక సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ పోస్ట్ విజయ్ అభిమానులను హ్యాపీ మోడ్ లో పెట్టేసింది.ఎందుకంటే ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సినిమాలతో తనదైన ముద్ర వేసిన సందీప్.. విజయ్ యాక్షన్‌ను ఈ రేంజ్‌లో పొగడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇక సందీప్ రెడ్డి వంగా పోస్ట్‌పై రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అవుతూ సందీప్ చెప్పిన మాటలు కరెక్ట్ అని, వాటికి తాను కూడా అగ్రీ అవుతానని తెలిపారు. విజయ్ దేవరకొండ కళ్లలో ఉన్న నిప్పు రాళ్లను కూడా కరిగించగలదంటూ తనదైన స్టైల్‌లో కామెంట్ చేశారు ఈ సెన్సేషనల్ డైరెక్టర్.మాములుగా రామ్ గోపాల్ వర్మ ఏ విషయంపై అయినా తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ మెచ్చుకుంటూ తన కళ్లలో ఉన్న ఫైర్ రాళ్లను కరిగించేంత పవర్‌ఫుల్‌గా ఉందంటూ ఆయన చేసిన కామెంట్ అభిమానులని ఫిదా చేస్తుంది.

Advertisement

విజయ్ దేవరకొండ విషయానికి వస్తే సందీప్ తీసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్‌లో భారీ క్రేజ్ కొట్టేశాడు ఈ రౌడీ భాయ్.ముఖ్యంగా ఇందులో విజయ్ చేసిన ఫెర్ఫామెన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’, ‘లైగర్’, ‘ఖుషి’కింగ్ డమ్ వంటి సినిమాలతో బోల్తా పడ్డ విజయ్ ‘రణబాలి’తో సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో మురిసిపోతున్నారు రౌడీ ఫ్యాన్స్.

మొత్తంగా ఒకవైపు సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు.. మరోవైపు రామ్ గోపాల్ వర్మ కామెంట్స్.. ఇలా ఇద్దరు ప్రముఖ దర్శకులు విజయ్ యాక్షన్ గురించి మాట్లాడటంతో ‘రణబాలి’సినిమా మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయిపొయింది.చూడాలి మరి వీరిద్దరు ఇచ్చిన ఈ హైప్ సినిమాకి ఎలా ప్లస్ అవుతుందో !

Tags

Related News

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×