E-Paper
Advertisement

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

YS Jagan: మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, అధికార పార్టీ అణచివేత చర్యలు శృతిమించాయని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితులు, వ్యవస్థల వైఫల్యంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

పులివెందులలో భయానక వాతావరణం

Advertisement

పులివెందులలో మొత్తం 40 వార్డులు ఉంటే, కేవలం 20 వార్డుల్లో మాత్రమే నామినేషన్లు వేయాల్సిన దుస్థితి ఏర్పడిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా, వైసీపీ కార్యకర్తలపై తప్పుడు హత్య కేసులు బనాయించారని ఆరోపించారు. డీఎస్పీలు, సీఐలే ఫిర్యాదుదారులుగా మారి కేసులు పెట్టడం చూస్తుంటే వ్యవస్థలు ఏ విధంగా దిగజారిపోయాయో అర్థమవుతోందన్నారు. ఓటు వేయనివ్వని చోట ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.

గవర్నర్‌ను కలిసిన వైనం

Advertisement

ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, అవినాష్ రెడ్డిలపై జరిగిన దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు జగన్ వెల్లడించారు. కేంద్ర బలగాల (CRPF) భద్రత ఉన్నప్పటికీ దాడులు జరగడాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు మంచి పద్ధతి కాదని గవర్నర్ అభిప్రాయపడ్డారని, అన్ని విషయాలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

హైకోర్టు మౌనంపై తీవ్ర ఆవేదన

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి జోక్యం చేసుకోకపోవడం బాధాకరమని జగన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు వ్యవస్థలు స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ‘ప్రజాస్వామ్యం దిగజారిపోతే దానిని కాపాడుకోవడం కోసం కాక్రోచ్‌లు, నక్సలిజం పుట్టుకొస్తాయి’ అని వ్యాఖ్యానించారు. అవసరమైతే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు

రాష్ట్రంలో నిష్పాక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే నామినేషన్ల ప్రక్రియను సెంట్రలైజ్ చేయాలని, పారామిలటరీ బలగాలను మోహరించాలని జగన్ డిమాండ్ చేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో ఎన్నికలు సజావుగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. టీడీపీ నేతల తీరును హెచ్చరిస్తూ.. ‘టైమ్ మీది కొడుతున్నారు.. రేపు మా టైమ్ వస్తుంది’ అని అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు మళ్లీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

Also Read: వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

Tags

Related News

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

Big Stories

Advertisement
×