E-Paper
Advertisement

విజయ్ దేవరకొండకు ఇంకా ఎంత రావాలంటే.. రణబాలి లెక్క ఇదే!

విజయ్ దేవరకొండకు ఇంకా ఎంత రావాలంటే.. రణబాలి లెక్క ఇదే!
Advertisement

Ranabali Box Office:‘రణబాలి’ ..రౌడీ హీరో విజయ్ దేవరకొండ,రష్మిక జోడీగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లని కొల్లగొడుతుంది.విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి గతంలో ‘గీత గోవిందం’,‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెల్సిందే.టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్ ఓస్లూ విలన్‌గా నటించడం తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

మరి అక్టోబర్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఏడో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎంత వసూలు చేయాలి? అనే విషయంలపై మనమూ ఒక లుక్కేద్దాం .

Advertisement

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో ఆర్నాల్ ఓస్లూ, ఈశ్వరి రావు, రాజా రవీంద్ర, వినోద్ సాగర్, జాసన్ షా, రవి మరియా కీలక పాత్రల్లో నటించారు. నీరవ్ షా, జిష్ణు భట్టాచార్జీలు సినిమాటోగ్రఫీ అందించగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చేశారు. అజయ్–అతుల్ సంగీతం అందించారు.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. ‘రణబాలి’ మొదటి రోజు ఇండియాలో రూ.10 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.ఇక ఆరో రోజు రూ6 కోట్ల నెట్ వసూళ్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.ఈ లెక్కల ప్రకారం చూస్తే ఆరు రోజుల్లోనే ఇండియాలో దాదాపుగా 50 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం.

Advertisement

ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే . ఇప్పటివరకు ఏపీ, తెలంగాణలో కలిపి సుమారు రూ.42 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఓవర్సీస్‌లో కూడా ‘రణబాలి’కు పాజిటివ్ టాక్ రావడంతో  దాదాపు రూ.8కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తుంది.

ఇక  ఓవర్సీస్‌లో మొత్తం రూ.11కోట్ల వరకు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల టాక్ .అంటే ఈలెక్కన మొత్తంగా చూస్తే ఇప్పటివరకు దాదాపు రూ.60 కోట్ల పై చిలుకు గ్రాస్ వసూళ్లు సాధించాయన్న మాట..

ఇక ఏడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో రూ.2 కోట్ల నెట్ వసూళ్లు రాగా ప్రపంచవ్యాప్తంగా రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వసూళ్లు రావచ్చని తెలుస్తుంది.ఈ లెక్కన మొత్తం మీద 65 కోట్ల పై చిలుకు వసూళ్ళని కొల్లగొట్టినట్టు లెక్క

.అయితే సినిమా కి సుమారు రూ.85 కోట్ల బడ్జెట్‌ పెట్టినట్టు తెలుస్తుంది,అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.90 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుందన్న మాట.చూడాలి మరి వచ్చే రోజుల్లో ఈ రౌడీ ఆ ముప్పై కోట్లని కొల్లగొట్టి విజయపతాకం ఎగరేస్తాడో లేక అబ్బే నా వల్ల కాదంటూ మధ్యలో చేతులెత్తేస్తాడో !

also read:వెంకీ సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. రచ్చకు రెడీనా!

Tags

Related News

వెంకీ సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. రచ్చకు రెడీనా!

గ్లామర్ షోతో కాదు.. సింపుల్ లుక్‌తోనే మ్యాజిక్ చేసిన సాన్యా!

రాజకీయాల్లోకి వెళ్లి ఆస్తులన్నీ పోగొట్టుకున్నా.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

బొబ్బిలి రాజా తర్వాత నా కెరీర్‌లో ఏం జరిగిందంటే.. శివాజీరాజా కామెంట్స్

‘జైలర్ 2’ జోరు చూస్తుంటే.. వెయ్యి కోట్లు పక్కానా?

సన్‌ఫ్లవర్‌లా మారాలంటున్న రితికా నాయక్.. అసలు మ్యాటర్ ఏంటంటే!

ఒక్కటి కాదు.. ఏకంగా 8 సినిమాలు! జంధ్యాలతో నరేష్ జర్నీమామూలుది కాదుగా !

Big Stories

Advertisement
×