E-Paper
Advertisement

వెంకీ సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. రచ్చకు రెడీనా!

వెంకీ సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. రచ్చకు రెడీనా!
Advertisement

Adarsha Kutumbam:విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పటికే చాలా సార్లు వాయిదాల పాట పాడిన ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 30న థియేటర్లలోకి రానుండటం తో మురిసిపోతున్నారు మూవీ లవర్స్ .

ఇక వెంకీ మామని మరోసారి కొత్త తరహా పాత్రలో చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా మాంచి ఐ ఫీస్ట్ అని చెప్పక తప్పదు.ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను తనదైన శైలిలో తెరకెక్కించే త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఎలాంటి కథను చూపించబోతున్నారనే క్యూరియాసిటీ ప్రతీ ఒక్కరిలో కనిపిస్తుంది కూడా.

Advertisement

ఇదిలా ఉంటె ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్. ఈ మధ్యే ‘మాల’అనే సెకండ్ సింగిల్ తో ప్రమోషన్స్‌లో మళ్లీ వేగం పెంచిన మేకర్స్, ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 23న హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని తెలుస్తుంది. మొత్తానికి ట్రైలర్ రిలీజ్ అయితే కాని సినిమాకు సంబంధించిన కథ, పాత్రలు, యాక్షన్ సన్నివేశాలు, కామెడీ ఎపిసోడ్స్‌పై క్లారిటీ వచ్చే చాన్స్ లేదు.

ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చే గురూజీ ఇందులో యాక్షన్ థ్రిల్లర్ జానర్ ని ఎలా మిక్స్ చేశాడా అని క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు మూవీ లవర్స్.త్రివిక్రమ్ సినిమాలైన ‘అత్తారింటికి దారేది’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాల్లో ఫామిలీ ఎమోషన్స్ ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకున్నాయో చెప్పక్కర్లేదు.దీంతో ఇప్పుడు వెంకటేష్‌తో తెరకెక్కించిన ‘ఆదర్శ కుటుంబం’కూడా అలానే ఆకట్టుకుంటుందా లేదా అని ఇప్పటి నుండే లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

Advertisement

ఇక వెంకటేష్ విషయానికి వస్తే, ఫ్యామిలీ స్టార్ గా ఆయనకీ ఎలాంటి గుర్తింపు ఉందో చెప్పక్కర్లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘దృశ్యం’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వెంకీ యాక్షన్ కథల్లోనూ తనదైన ముద్ర వేశాడు కూడా .దీంతో ఈసారి ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి, ఈ ప్రాజెక్ట్‌లో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందన్న క్యూరియాసిటీ పెంచేస్తుంది.మొత్తంగా అక్టోబర్ 23న విడుదల కానున్న ట్రైలర్‌తో ఈ అంచనాలకు క్లారిటీ రానుండగా, అక్టోబర్ 30న థియేటర్లలోకి రానున్న ‘ఆదర్శ కుటుంబం’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ALSO READ :గ్లామర్ షోతో కాదు.. సింపుల్ లుక్‌తోనే మ్యాజిక్ చేసిన సాన్యా!

Tags

Related News

గ్లామర్ షోతో కాదు.. సింపుల్ లుక్‌తోనే మ్యాజిక్ చేసిన సాన్యా!

రాజకీయాల్లోకి వెళ్లి ఆస్తులన్నీ పోగొట్టుకున్నా.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

బొబ్బిలి రాజా తర్వాత నా కెరీర్‌లో ఏం జరిగిందంటే.. శివాజీరాజా కామెంట్స్

‘జైలర్ 2’ జోరు చూస్తుంటే.. వెయ్యి కోట్లు పక్కానా?

సన్‌ఫ్లవర్‌లా మారాలంటున్న రితికా నాయక్.. అసలు మ్యాటర్ ఏంటంటే!

ఒక్కటి కాదు.. ఏకంగా 8 సినిమాలు! జంధ్యాలతో నరేష్ జర్నీమామూలుది కాదుగా !

కొత్త బంగారులోకం 2 పై వరుణ్ సందేశ్ బిగ్ అప్డేట్.. సీక్వెల్ సినిమా రాబోతోందా?

Big Stories

Advertisement
×