E-Paper
Advertisement

90 ఏళ్లకోసారి వచ్చే ఫెస్టివల్… పండగకు పిలిచి పాతిపెట్టే ప్లాన్… సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్

90 ఏళ్లకోసారి వచ్చే ఫెస్టివల్… పండగకు పిలిచి పాతిపెట్టే ప్లాన్… సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Psychological Horror Movie: పగలంతా వెలుగుతో నిండిపోయిన ప్రదేశం… చుట్టూ అందమైన పూలు, తెల్లని దుస్తులు, పాటలు, పండగ సందడి. ఇంత అందమైన వాతావరణంలో భయంకరమైన రహస్యాలు దాగి ఉంటాయని ఎవరైనా ఊహిస్తారా ? స్నేహితులతో కలిసి ఓ వేడుకకు వెళ్లిన ప్రయాణం, ప్రాణాల కోసం పోరాడే పరిస్థితిగా మారితే ? బయటకు స్వర్గంలా కనిపించే ఓ గ్రామంలో జరిగే వింత ఆచారాలు, మనసును కలవరపెట్టే సంఘటనలతో తెరకెక్కిన సైకలాజికల్‌ హారర్‌ చిత్రమే ‘మిడ్‌సమ్మర్‌’ (Midsommar). ఇంకా ఈ మూవీని చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి. మరి ఈ సినిమాను తెలుగులో ఎక్కడ చూడొచ్చు ? కథ ఏంటి ? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

డాని తన కుటుంబంలో జరిగిన విషాదకరమైన సంఘటనతో తీవ్రంగా కుంగిపోతుంది. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, బాయ్‌ఫ్రెండ్‌ క్రిస్టియన్‌ తో ఆమె రిలేషన్ కూడా సరిగా ఉండదు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్నా, ఒంటరిగా మిగిలిపోతానేమో అనే భయంతో డాని అతడితోనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో క్రిస్టియన్‌ స్నేహితులు స్వీడన్‌ లోని ఓ మారుమూల గ్రామానికి వెళ్లాలని ప్లాన్‌ చేస్తారు.

Advertisement

ఆ గ్రామంలో ప్రతి 90 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రత్యేకమైన వేసవి పండగను అధ్యయనం చేయాలనేది వారి ఉద్దేశం. డాని కూడా వారితో కలిసి ప్రయాణిస్తుంది. అక్కడికి వెళ్లగానే వారికి మరో ప్రపంచంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. తెల్లని దుస్తులు ధరించిన గ్రామస్థులు, పూలతో అలంకరించిన ప్రదేశాలు, పాటలు, సంప్రదాయ వేడుకలు మొదట అందరినీ ఆకట్టుకుంటాయి. అంతా ప్రశాంతంగా కనిపించడంతో స్నేహితులు కూడా ఆ వాతావరణానికి అలవాటు పడతారు.

కానీ పండగలో భాగంగా జరిగే కొన్ని ఆచారాలు వారిని భయపెట్టడం మొదలుపెడతాయి. గ్రామస్థులు వాటిని సాధారణ సంప్రదాయాలుగా భావిస్తుంటే, బయట నుంచి వచ్చిన వారికి మాత్రం వాటి వెనుక ఉన్న భయంకరమైన అర్థం అస్సలు అర్థం కాదు. ఒక్కొక్కటిగా జరిగే ఊహించని సంఘటనలు వారి అనుమానాలను పెంచుతాయి. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించినా, పరిస్థితులు వారికి అనుకూలంగా ఉండవు.

Advertisement

స్నేహితులు ఒక్కొక్కరుగా ప్రమాదంలో పడుతున్న సమయంలో డాని మానసిక పరిస్థితి, క్రిస్టియన్‌తో ఆమె బంధం కూడా కథలో కీలకంగా మారతాయి. చీకటి గదులు, దెయ్యాల కంటే భయంకరంగా పగటి వెలుతురులోనే జరిగే సంఘటనలు ఈ సినిమాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని తీసుకొస్తాయి. చివరికి ఆ గ్రామం పండగ వెనుక దాగిన రహస్యం ఏమిటి ? డాని అక్కడి నుంచి బయట పడగలదా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?

2019లో విడుదలైన ‘మిడ్‌సమ్మర్‌’ (Midsommar)లో ఫ్లోరెన్స్‌ ప్యూ, జాక్‌ రేనర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌ (JioHotstar)లో అందుబాటులో ఉంది. అందులోనూ తెలుగు డబ్బింగ్‌ తోనే స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. సైకలాజికల్‌ హారర్‌, వింత ఆచారాలు వంటి కథలు ఇష్టపడేవారు ఈ సినిమాను చూడవచ్చు. అయితే ఇందులో తీవ్రమైన హింస, అసౌకర్యం కలిగించే సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి పిల్లలతో కలిసి చూడకపోవడమే బెటర్.

Read Also: ప్రళయాన్ని సృష్టించగల డేంజరస్ టెక్నాలజీ… అడ్డుకునేందుకు సైంటిస్ట్ ఒంటరి పోరాటం… మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్

Tags

Related News

మరువలేని స్టార్ హీరో మరుగున పడిపోతే… హీరోలను ప్రాణంగా ప్రేమించే ఫ్యాన్స్ డోంట్ మిస్… వైరల్ సిరీస్

మతాలు వేరైనా మనసులు కలిస్తే… ట్రెండింగ్ రొమాంటిక్ కామెడీ సిరీస్

పేదరికంలో బతికే వ్యక్తికి భవిష్యత్తు ముందే తెలిసే వరం… రాత్రికి రాత్రే రచ్చ… తెలుగు సిరీస్ స్ట్రీమింగ్ షురూ

భార్య మిస్సయ్యిందని వెళ్తే పోలీసులకే దిమ్మతిరిగే షాక్… 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్ – శ్వేత బసు జంటగా నటించిన సిరీస్ స్ట్రీమింగ్

రామాయణ సినిమాకు హాట్ స్టార్ బిగ్ షాక్.. ఇంట్లో చూడాలన్న డబ్బులు కట్టాల్సిందే?

థియేటర్లలో 170 కోట్లు కొల్లగొట్టిన నాని ఊచకోత… ఐదు భాషల్లో ఓటీటీలోకి

ఆ ఇంట్లో చిక్కుకుంటే ప్రాణాలు దక్కవు… ఒళ్లు గగుర్పొడిచే సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×