E-Paper
Advertisement

Spirit Movie: ప్రభాస్ స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్ క్యామియో…అంచనాలు పెంచిన సందీప్ రెడ్డి!

Spirit Movie: ప్రభాస్ స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్ క్యామియో…అంచనాలు పెంచిన సందీప్ రెడ్డి!
Advertisement

Spirit Movie: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy)దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) స్పిరిట్(Spirit) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి ఎట్టకేలకు ఈ సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతోంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోవడంతో సినిమాకు సంబంధించి ఒక్కొక్క విషయం బయటకు వస్తున్నాయి.

స్పిరిట్ కోసం యానిమల్ హీరో?

ప్రస్తుతం స్పిరిట్ సినిమాలో ప్రభాస్ లుక్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా కోసం పనిచేస్తున్న టెక్నీషియన్ లు, అసిస్టెంట్ డైరెక్టర్లకు సంబంధించిన విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఈ సినిమాలో మరొక స్టార్ హీరో నటించబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి(Chiranjeevi) ఆ పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలను పూర్తిగా సందీప్ రెడ్డి ఖండించారు. ఈ సినిమాలో క్యామియో పాత్రలో నటించడం కోసం టాలీవుడ్ హీరోలను కాకుండా సందీప్ రెడ్డి బాలీవుడ్ స్టార్ హీరోను రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది.

స్పిరిట్ సినిమాలో రణబీర్ కపూర్?

Advertisement

ఈ సినిమాలో క్యామియో పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. అందుకే సందీప్ రెడ్డి ఈ క్యామియో పాత్రలో నటించడం కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) ను సంప్రదించడంతో రణబీర్ సైతం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇదివరకే సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. అందుకే సందీప్ రెడ్డి అడగడంతో వెంటనే రణబీర్ కపూర్ స్పిరిట్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరి స్పిరిట్ సినిమాలో రణబీర్ కపూర్ పాత్ర ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

రూ.1500 కోట్ల బడ్జెట్ తో స్పిరిట్..

Advertisement

రణబీర్ కపూర్ ప్రభాస్ సినిమాలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా సుమారు 1500 కోట్ల బడ్జెట్ తో గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.ఏకంగా 9 భాషలలో ఈ చిత్రాన్ని భద్రకాళి ఆర్ట్స్ ,టి సిరీస్ బ్యానర్లపై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక రణబీర్ కపూర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: NBK 111: బాలకృష్ణతో స్పెషల్ స్టెప్పులు … రంగంలోకి స్టార్ బ్యూటీ!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×