E-Paper
Advertisement

NBK 111: బాలకృష్ణతో స్పెషల్ స్టెప్పులు … రంగంలోకి స్టార్ బ్యూటీ!

NBK 111: బాలకృష్ణతో స్పెషల్ స్టెప్పులు … రంగంలోకి స్టార్ బ్యూటీ!
Advertisement

NBK 111: నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈయన త్వరలోనే ఆఖండ 2(Akhanda 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డిసెంబర్ ఐదవ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదల చేసిన సాంగ్స్, ట్రైలర్, టీజర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని (GopiChand Malineni )దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.

బాలయ్యకు జోడిగా నయనతార..

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇదివరకు వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ మరోసారి ఈయన డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా నయనతార (Nayanatara)నటించబోతున్నట్లు ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం అధికారకంగా తెలియజేస్తూ ఒక స్పెషల్ వీడియోని విడుదల చేశారు.

బాలయ్యతో తమన్నా స్పెషల్ స్టెప్పులు?

Advertisement

ఇకపోతే ఇటీవల బాలకృష్ణ సినిమా అంటే కచ్చితంగా స్పెషల్ సాంగ్(Special Songs) ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని సమాచారం. అయితే ఈ పాటలో నటించడం కోసం రంగంలోకి స్టార్ బ్యూటీని దించబోతున్నట్టు తెలుస్తుంది. మరి బాలయ్యతో కలిసి స్పెషల్ స్టెప్పులు వేయబోతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరు అనే విషయానికొస్తే తను మరెవరో కాదు మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannah) అంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇలా తమన్నా బాలయ్య పక్కన స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

కోట్లలో రెమ్యూనరేషన్..

Advertisement

ఇటీవల తమన్నా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్యతో స్పెషల్ స్టెప్పులు వేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఇక తమన్నా ఒక స్పెషల్ సాంగ్ చేయడం కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.. ఇలా స్పెషల్ సాంగ్స్ కోసం ఈమె ఏకంగా కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇదివరకే పలువురు స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు బాలయ్య సినిమాలు సందడి చేయబోతున్నట్టు సమాచారం.

Also Read: Maruthi: కాలర్ ఎగరేస్తారని చెప్పను కానీ.. మారుతి సెటైర్స్ ఎన్టీఆర్ వార్ 2 పైనేనా?

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×