E-Paper
Advertisement

‎Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డకు ఇష్టమైన హీరో అతనేనా? తెలుగులో ఎవరు లేరా?

‎Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డకు ఇష్టమైన హీరో అతనేనా? తెలుగులో ఎవరు లేరా?
Advertisement

‎Siddu Jonnalagadda: టాలీవుడ్ హీరో సిద్దూజొన్నలగడ్డ( Siddu Jonnalagadda) గురించి మనందరికీ తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే చివరగా జాక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా తర్వాత సిద్దు జొన్నలగడ్డ నటించిన సినిమా తెలుసు కదా(Telusu Kada). సిద్దు నటించిన ఈ లేటెస్ట్ మూవీ మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అంచనాలు పెంచిన అప్డేట్స్..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు,టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. కాగా రొమాంటిక్‌ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రాశి ఖన్నా(rashi khanna), శ్రీనిధి శెట్టి( Srinidhi Shetty) హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీకు లేడీ డైరెక్టర్ నీరజ కోన(Neeraja Kona) దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీప్రసాద్‌ నిర్మించారు.

ఫేవరేట్ హీరో అతనే..

Advertisement

ఇకపోతే ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో సిద్ధు సరదాగా నెటిజన్స్ తో ముచ్చటించారు. ట్విట్టర్‌ వేదికగా ఆస్క్ సిద్దు పేరుతో చిట్‌ చాట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అభిమానులు అడిగే ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మీ ఫెవరేట్ హీరో ఎవరు అని ప్రశ్నించగా.. ఆ విషయంపై స్పందించిన సిద్దు జొన్నలగడ్డ తన ఫేవరేట్ హీరో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) అంటూ సమాధానం ఇచ్చారు.



‎ తెలుగు హీరోలు ఎవరూ లేరా?

‎అయితే ఈ సందర్బంగా సిద్దు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత మంది స్టార్ హీరోలు ఉండగా బాలీవుడ్ హీరోని ఇష్టపడటం ఏంటి? తెలుగు హీరోలు ఇంతమంది ఉన్నారు కదా అంటూ సిద్దుపై మండి పడుతూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంటే టాలీవుడ్ హీరోలు ఎవరు ఇష్టం లేదా, మీకు గుర్తింపు వచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారానే కదా మరి అలాంటప్పుడు బాలీవుడ్(Bollywood) హీరో ఫేవరెట్ హీరో అని చెప్పడం ఏంటి అంటూ కొంతమంది మండిపడుతున్నారు. కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. మరీ ఈ నెగటివ్ కామెంట్స్ పై ట్రోల్స్ పై హీరో సిద్దు జొన్నలగడ్డ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Advertisement

Also Read: Bunny vasu: పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోను… బన్నీ వాసు మాస్ వార్నింగ్

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×