BigTV English

‎Bunny vasu: పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోను… బన్నీ వాసు మాస్ వార్నింగ్

‎Bunny vasu: పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోను… బన్నీ వాసు మాస్ వార్నింగ్
Advertisement

‎Bunny Vasu: విజయేందర్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ మిత్రమండలి(Mitra Mandali). ఇందులో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక NM కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. బన్నీ వాస్(Bunny Vasu) సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా నుంచి విడుదల అయినా పాటలు టీజర్ ట్రైలర్ ఇవన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేసాయి.


సినిమా ప్రమోషన్స్ లో బిజీ..

కాగా ఈ మూవీ మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 16న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇకపోతే ఈ మూవీ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ ని చూస్తే అర్థమవుతుంది. కాగా తెలుస్తోంది. మిత్ర మండలి సినిమా రేపు అక్టోబర్ 16న రిలీజ్ అవుతుండగా ఈరోజు రాత్రికే ప్రీమియర్స్ వేస్తున్నారు. కాగా మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే అనేక అంశాల గురించి స్పందించారు.

కొందరికి నచ్చకపోవచ్చు..

‎అయితే ఈ క్రమంలోనే బన్నీ వాసు ఇచ్చిన మాస్(Mass Warning) వార్నింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ప్రమోషన్స్ లో భాగంగా ఒక రిపోర్టర్ బన్నీ వాసుని ప్రశ్నిస్తూ.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆ ట్రైలర్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అనిపించింది. కొంతమంది ట్రైలర్ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని డి గ్రేట్ చేయాలని అనుకున్నట్టు వార్తలు వినిపించాయి మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అని రిపోర్టర్ ప్రశ్నించగా వెంటనే బన్నీ వాసు స్పందిస్తూ.. డైరెక్ట్ గా మాట్లాడితే పర్లేదు. మామూలుగా ఒక విషయం కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చదు.

‎ఎలా ఎప్పుడు ఇవ్వాలో అది ఇచ్చేస్తాను..

‎అతడు చేసిన కామెంట్స్ ని నేను పట్టించుకుంటాను. నాకు కావాలి అంటే తీసుకుంటాను లేదంటే నేను చేసింది ఇతనికి అర్థం కాలేదని ఆ విషయం అక్కడితోనే వదిలేస్తాను. కొంతమంది వెనుక నుంచి ఇస్తారు చూసారా అది నేను గట్టిగానే ఇస్తాను. ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తే నేను కూడా ధైర్యంగా ఎదుర్కొంటాను. అంటే ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తే ఎంత యుద్ధమైనా చేస్తాను. కానీ వెనుక నుండి పిచ్చిపిచ్చిగా చేస్తే ఎక్కడ ఎలా ఎప్పుడు ఇవ్వాలో అది ఇచ్చేస్తాను అంటూ నవ్వుతూనే మాస్ వార్నింగ్ ఇచ్చారు బన్నీ వాసు. ఈ సందర్భంగా బన్నీ వాసు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ కామెంట్స్ పై స్పందించిన నెటిజన్స్ కరెక్ట్ గా చెప్పారు అంటూ ఆయనకు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు.


Also Read: NBK 111: గోపీచంద్ – బాలయ్య మూవీ పై బిగ్ అప్డేట్.. చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందంటూ!

Related News

Hrithik Roshan: ఢిల్లీ హైకోర్టులో హృతిక్ రోషన్ కు భారీ ఊరట… వెంటనే ఆ పని చేయాలంటూ!

‎Ahana Krishna: ఖరీదైన కారు కొన్న నటి… ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

‎Sai Durga Tej: బ్రో తర్వాత నా సినిమాలు ఆగిపోయాయి.. సాయి తేజ్ ఎమోషనల్!

Brahmanandam: ప్రముఖ షోలో గుక్కపెట్టి ఏడ్చిన బ్రహ్మానందం.. అసలేం జరిగిందంటే!

Nithiin – Sharwanand : నితిన్ వదిలేసిన కథతో శర్వానంద్, ఇద్దరిదీ ఒకే స్థితి

Sonakshi Sinha: తల్లి కాబోతున్న మరో స్టార్‌ హీరోయిన్‌.. ఇదిగో క్లారిటీ!

Deepika -Smriti Irani:దీపికా పని గంటల వివాదంపై స్మృతి ఇరానీ కామెంట్స్..  లాభాలు రావాలంటూ!

Big Stories

×