E-Paper
Advertisement

Guntur Train Molest Case: ఏపీలో దారుణం.. రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

Guntur Train Molest Case: ఏపీలో దారుణం.. రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
Advertisement

Guntur train molest case: ఏపీలో దారుణం ఘటన చోటుచేసుకుంది. గుంటూరు పరిధిలో రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం చేశాడో కామాంధుడు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. సత్రగంజ్-చర్లపల్లి రైలులో మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రాజారావుగా పోలీసులు గుర్తించారు.

మహిళల బోగీలో

గుంటూరు జిల్లా పరిధిలో రన్నింగ్ ట్రైన్ లో మహిళపై ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. గుంటూరు నుంచి చర్లపల్లి వెళ్తున్న రైలులో ఈ దారుణం జరిగింది. సత్రగంజ్-చర్లపల్లి రైలులోని మహిళా బోగీలో గుర్తుతెలియని చొరబడ్డాడు. గుంటూరు-పెదకూరపాడు రైల్వే స్టేషన్ల మధ్య బోగీలో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి బ్యాగ్, ఫోన్ లాక్కున్నాడు.

Advertisement

అనంతరం మహిళపై అత్యాచారం చేశాడు. మహిళ గట్టిగా వేయడంతో పెదకూరపాడు వద్ద రైలులోంచి దూకి పరారయ్యాడు. రైలు చర్లపల్లికి చేరుకున్న తరువాత బాధితురాలు చర్లపల్లి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఒక్కరోజులోనే అరెస్టు చేశారు.

తెనాలిలో అరెస్ట్

బాధితురాలి ఫిర్యాదుతో సికింద్రాబాద్ లో కేసు నమోదైంది. సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని గుర్తించారు రైల్వే పోలీసులు. మహిళ నుంచి చోరీ చేసిన సెల్ ఫోన్ సత్తెనపల్లిలో అమ్మేసి నిందితుడు తెనాలి పారిపోయినట్లు పోలీసులకు గుర్తించారు. తెనాలిలో రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరు స్థానిక పోలీసులకు అప్పగించనున్నారు.

Advertisement

Also Read: Student Suicide: ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.. క్లాస్‌ రూమ్‌లో ఉరివేసుకుని స్టూడెంట్ సూసైడ్

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×