E-Paper
Advertisement

ప్రముఖ మలయాళ దర్శకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏం జరిగిందంటే?

ప్రముఖ మలయాళ దర్శకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏం జరిగిందంటే?
Advertisement

Ranjith Arrest: ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు, కేరళ చలచిత్ర అకాడమీ మాజీ చైర్మన్ రంజిత్, ఒక యువ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై బుధవారం (ఏప్రిల్ 1, 2026) పోలీసుల కస్టడీలోకి తీసుకోబడ్డారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆయన తనపై లైంగిక దాడికి ప్రయత్నించారని ఒక యువ నటి ఫిర్యాదు చేయడంతో కొచ్చి సిటీ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. బాధితురాలి కథనం ప్రకారం, షూటింగ్ సెట్‌లోని ఒక కారవాన్‌లోకి తనను ఆహ్వానించిన రంజిత్, అక్కడ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించడానికి ప్రయత్నించారు. ఈ ఫిర్యాదుపై సోమవారం మహిళా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు, మంగళవారం రాత్రి రంజిత్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం తరలించి, బుధవారం ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Read also-‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోలు మారడానికి కారణం ఏంటో తెలిపిన దర్శకుడు వేణు..

గతంలో కూడా..

Advertisement

రంజిత్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత, రంజిత్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2024లో బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర, 2009లో ‘పలేరి మాణిక్యం’ సినిమా ఆడిషన్ సమయంలో రంజిత్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ వివాదం కారణంగానే ఆయన కేరళ చలచిత్ర అకాడమీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2012లో బెంగళూరులోని ఒక హోటల్‌లో రంజిత్ తనను లైంగికంగా వేధించాడని ఒక పురుష నటుడు కూడా గతంలో ఫిర్యాదు చేశారు.

Read also-పొదరిల్లు.. ఏప్రిల్1: చక్రీకి షాకిచ్చిన మహా.. నారాయణకు నిద్ర లేకుండా చేసిన మహా.. కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్..

పోలీసుల గోప్యత

Advertisement

ఈ తాజా కేసులో దర్యాప్తు ప్రక్రియను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. బాధితురాలి వివరాలను వెల్లడించకుండా జాగ్రత్త వహించారు. ఇడుక్కి ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్ నిర్వహించి రంజిత్‌ను అదుపులోకి తీసుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో వరుసగా బయటపడుతున్న ఇలాంటి లైంగిక వేధింపుల ఉదంతాలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. రంజిత్ ప్రస్తుతం కొచ్చిలోని జైలులో రిమాండ్‌లో ఉన్నారు. దీనిపై కోర్డు ఏం తీర్పు ఇస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×