Podarillu Today Episode April1st : నిన్నటి ఎపిసోడ్ లో.. మహాలక్ష్మి, ఉపేంద్ర ఇద్దరు కలిసి నారాయణను జాగ్రత్తగా తీసుకొని హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ డాక్టర్ తో మహాలక్ష్మి కత్తిపోటు గురించి చెప్తుంది వెంటనే ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేసిన డాక్టర్ అతనికి స్కానింగ్ తీయాలని చెప్తాడు.. ఈ విషయాన్ని ఎలాగైనా సరే చక్రీకి చెప్పాలని మహాలక్ష్మి అనుకుంటుంది. చక్రి కి ఫోన్ చేసి నీకు విషయం చెప్పాలండి అని అంటుంది.. ఏంటి కాలేజీలో సర్టిఫికెట్లు తీసేసుకున్నారా అని చక్రి అడుగుతాడు.. లేదండి హాస్పిటల్లో ఉన్నాము స్కానింగ్ రిపోర్ట్ ల కోసం వెయిట్ చేస్తున్నాము అని అనగానే..
అదేంటి సర్టిఫికెట్లు హాస్పిటల్ ఇస్తున్నారా అని చక్రి అడుగుతారు.. లేదండి అక్కడ పెద్ద రచ్చ జరిగింది అని చెప్పగానే ఏం జరిగింది మళ్లీ ఆ పిలకవాడు వచ్చాడా అని చక్రీ అంటాడు.. చక్రికి మహా నిజం చెప్పేస్తుంది.. అయితే నారాయణకు ఏమైనా అయ్యిందేమో అని అందరూ కంగారు పడిపోతుంటారు. కానీ అక్కడ ఏమీ జరగలేదని తెలుసుకొని హ్యాపీగా ఉంటారు. ఇంటికొచ్చిన నారాయణ ను చూసి మహాలక్ష్మి ఈ విషయాల గురించి మాట్లాడితే బాధపడుతుంది అని అందరూ అనుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాత్రి హారిక మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది.. ఇక మహాలక్ష్మి హారికకు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. తన భార్యను చంపి జైలుకు వెళ్లాడో లేదో తెలియదు కానీ నీ భర్తను మాత్రం జైలుకు వెళ్లకుండా ఆయనే కాపాడాడు. దేవుడి దయవల్ల ఆయనకు ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది లేదంటే మాత్రం నీ భర్తకి జైలు శిక్ష ఉరి శిక్ష పడేది అని మహాలక్ష్మి హారికతో అంటుంది.. ఇక మహాలక్ష్మి ఫోన్ పెట్టగానే హారిక.. వాళ్లందరితో మంచిగా ఉంటుంది అంటే ఆ చిన్న ఇంట్లో మహా ఉండాలనే అనుకుంటుందా..? చక్రి తో పెళ్లి బంధం నిజమే అనుకుంటున్నా అని ఆలోచిస్తూ ఉంటుంది.. రాత్రి అయితే నారాయణకు టాబ్లెట్స్ ఇవ్వాలి అని మహా అలారం పెట్టుకుని మరీ పడుకుంటుంది. అందరూ పడుకున్న తర్వాత మాధవ్ గాయత్రి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
బయట చక్రి ఒక్కడే ఉంటాడు.. ఫోన్ చూసుకుంటూ ఉండగా సడన్గా మహాలక్ష్మి రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. మీరా నేను ఇంకా ఎవరు అనుకుని భయపడిపోయాను అని చక్రీ అంటాడు.. మీరు కాలేజీకి వెళ్లి ఏం సాధించుకుని వచ్చారో నాకు అర్థం కావడం లేదు అని చక్రి అంటాడు.. మా నాన్న గనుక లేకపోతే మీ పరిస్థితి ఏంటి.? అంత పెద్ద బొట్టు ఉంది కాబట్టి మా నాన్నకి ఏమీ కాలేదు అని చక్రి అనగానే.. మహాలక్ష్మి ఎప్పుడు చూసినా ఆయన పొట్ట మీద పడతారు. ఆయనే లేకుండా ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటో ఊహించుకో లేకపోతున్నాను అని అంటుంది.. మా అన్నయ్య ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అని మహాలక్ష్మి అంటుంది.. మమ్మల్ని ఎవర్ని వద్దని వెళ్లారు ఏం చేశారు. చంప దెబ్బతిని వచ్చారు అని చక్రి అనగానే మహా సీరియస్ అవుతుంది.. మీరు సర్టిఫికెట్లు ఎందుకు తెచ్చుకోలేదు అని చక్రి అడుగుతాడు.. సర్టిఫికెట్లు పోయాయని ముందుగా పోలీసుల దగ్గరికి వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంట ఆ తర్వాత కాలేజీలో సబ్మిట్ చేయాలంట అని చెప్పగానే ఉంటుందా మరి ఇదంతా తెలుసుకోకుండా ఎలా వెళ్లారు అని చక్రి అడుగుతాడు..
నేను మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు ఆయన కూడా మా ఇంట్లో వాళ్ళు అంత పెద్ద రచ్చ చేశారు. మీరు ఇంత చేసినా కూడా మీ వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. మా వాళ్ళు అసలు పెళ్లి కరువులో ఉన్నారు. ఇంటికి ఒక షాపం ఉంది అందుకే దాన్ని పోగొట్టుకోవడానికి నేను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసి అందరిని పిలిచారు అని చక్రి అంటాడు. ఇక మహా చక్రి ఇద్దరూ కూడా కాసేపు గొడవపడి వెళ్ళిపోతారు. ఇక అలారం పెట్టుకుని మహాలక్ష్మి నారాయణకు మాత్రలు ఇచ్చి వస్తుంది.. ఏంటమ్మా మహాలక్ష్మి ఈ టైంలో అలారం పెట్టావా లేదా ఫోన్ వచ్చిందా అని మాధవ్ అడుగుతాడు. మీ నాన్నగారికి ఆరుగంటలకు ఒకసారి టాబ్లెట్ ఇవ్వాలి. అందుకే అలారం పెట్టుకొని లేచాను అని చెప్పగానే ఇవన్నీ నీకు ఎందుకమ్మా అని మాధవ్ అంటాడు.
అలారం సౌండ్ కి అందరూ లేచి బయటకు వెళ్లిపోతారు. మహాలక్ష్మి నారాయణను బెదిరించి టాబ్లెట్స్ ఇవ్వడం చూసి నలుగురు మురిసిపోతారు. నేను అసలు ఈ టాబ్లెట్ లో వేసుకోను అని నారాయణ ఎంతగా చెప్తున్నా సరే మహాలక్ష్మి ముక్కు మూసి నోట్లో వేస్తానని బెదిరిస్తుంది. నేను జైలుకు వెళ్లొచ్చానని పేరు ఉందో తెలుసా అని అనగానే మీరు ఎప్పుడో వెళ్ళొచ్చారు. నేను ఇప్పుడు కత్తి నోరు పెట్టి అక్కడ పెట్టొచ్చాను. అది తీసి పొడిచి ఇప్పుడు జైలుకు వెళ్తానని మహా అంటుంది.. ఆ మాట వినగానే నలుగురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. మహాలక్ష్మి నారాయణ ఇద్దరు కూడా సరదాగా గొడవపడతారు అది చూసిన నలుగురు కూడా సంతోషంగా ఉంటారు.
మహాలక్ష్మి లోపలికి రాగానే చక్రి నాన్న లాంటి మనిషిని కూడా అంత బాగా చూసుకుంటుంది అంటే ఎంత మంచి మనసులో తెలుసు కదా అని అంటాడు. తనని మనిషి నాకు దొరకడం నా అదృష్టం అని అనగానే.. కేశవ మాత్రం తన దురదృష్టం అని అంటాడు.. ఇక మహాలక్ష్మి పడుకుని నిద్రపోతుంది. గాయత్రి మాత్రం తన బావని తలుచుకొని బాధపడిపోతూ ఉంటుంది. ఇక తాయారు పురుషోత్తం ఇద్దరు కూడా పెళ్లికై ఖర్చుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి ఒక్కగానే ఒక్క ఆడపిల్ల కాబట్టి మనము పెళ్లి ఘనంగా చేయాలి అని అంటుంది. వచ్చే ముహూర్తానికి గాయత్రి పెళ్లి చేసేయాలి అని పురుషోత్తమంటాడు. మాట వినగానే గాయత్రీ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఈ విషయం ఎలాగైనా సరే బావతో చెప్పాలని అనుకుంటుంది.. మహాలక్ష్మి మళ్ళీ అలారం మోగడంతో టాబ్లెట్ ఇవ్వాలని బయటకు వెళుతుంది. నారాయణ మహానియంతగా అంటున్న సరే టాబ్లెట్ వేసుకోవాలి అని చెప్తుంది..
అందరూ ఇక్కడే ఉన్నారు గాని పెద్ది ఎక్కడ కనిపించడం లేదు అని మహా అనుకుంటుంది.. బయటికి వెళ్లి చూడగానే గాయత్రి మాధవ్ ఇద్దరు మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది బావ అని గాయత్రి అనడంతో మాధవ్ బాధ పడిపోతాడు. మీ అమ్మ వల్ల మనిద్దరం కలవలేక పోతున్నాము అని ఇద్దరు కూడా బాధపడిపోతూ ఉంటారు. నా జీవితంలోకి వస్తే నాకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు అని మాధవ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు అది చూసిన మహాలక్ష్మి బాధపడుతుంది.. నా తమ్ముళ్లు నా పెళ్లి కోసం ఎంత దూరమైనా వెళ్తారు కాబట్టి నేను బయట పెట్టడం లేదు అని మాధవ్ అంటాడు. మన బంధం ఇక్కడితోనే ఆపేద్దాం వెళ్ళు నువ్వు వెళ్లి ఆ పెళ్లి చేసుకొని మాధవ్ అంటాడు..
Also Read : ధీరజ్ మాటతో ప్రేమ షాక్.. వల్లికి చుక్కలు చూపించిన చెల్లెల్లు.. చందుకు వల్లి దూరం..
నారాయణ ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఉంటుంది మహా.. మీరు ఉదయాన్నే సైకిల్ తొక్కుకుంటూ ఎలా వెళ్లారు అని అతనిపై సీరియస్ అవుతుంది. ఇగ మీకేమైనా కావాలంటే నన్ను అడగండి అని అనగానే మహాలక్ష్మి షాక్ అవుతుంది. నన్ను కంట్రోల్లో పెట్టాలని అనుకుంటున్నావేమో కానీ అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు అని నారాయణ అంటాడు. మీరు ఇలా చెప్తే అసలు వినరు కదా అని సైకిల్ కి తాళం వేసేసి దాని దగ్గర పెట్టుకుంటుంది.. ఆ ఎదవల్ని కూడా దారిలో పెట్టి చూస్తాను అని మహాలక్ష్మి తో ఛాలెంజ్ చేస్తాడు.. వాళ్ళ బయటికి వెళ్ళగానే ముగ్గురు అన్నదమ్ములు కూడా ఫోన్ కోసం గొడవ పడుతూ ఉంటారు.. ముగ్గురు అన్నదమ్ములని బయటికి తీసుకుని వెళ్లి మాధవ్ గాయత్రీల విషయాన్ని బయటపెడుతుంది మహా… మనం పోలీసులుకు చెప్పి ఉంటే బాగుండేది పోలీసులు వాళ్ళకి పెళ్లి చేసే వాళ్ళు కదా అనేసి మహాలక్ష్మి అంటుంది.. పెద్దికి ఎలాగైనా పెళ్లి చేయాలి అని మహా అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..