E-Paper
Advertisement

రణ్వీర్ సింగ్‌పై బాలీవుడ్ నిషేధం…రూ. 45 కోట్ల వివాదంలో ఊహించని షాక్!

రణ్వీర్ సింగ్‌పై బాలీవుడ్ నిషేధం…రూ. 45 కోట్ల వివాదంలో ఊహించని షాక్!
Advertisement

Ranveer Ban: ‘దురంధర్’, ‘దురంధర్ ది రివెంజ్’ లాంటి వరుస ఇండస్ట్రీ హిట్స్ తో ఇండియన్ సినిమాని షేక్ చేసిన రణ్ వీర్ సింగ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అవును .. రణ్ వీర్ సింగ్ అసలు మరే సినిమాలో నటించకూడదు అంటూ అతనిపై ఏకంగా మూడేళ్ల పాటు బ్యాన్ వేసింది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE).అసలే హిట్స్ లేక డీలా పడిపోయిన బాలీవుడ్ బాక్సాఫీస్ కి ఊపిరిపోసిన ఈ స్టార్ హీరోపై ఎందుకు నిషేధం విధించారో చూద్దాం.

నో చెప్పడంతో ఇద్దరి మధ్య క్లాషెస్

Advertisement

ఈ ఇష్యూ అంతా మొదలైంది ‘డాన్ 3’ ప్రాజెక్ట్ దగ్గర. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ ల తర్వాత ఐకానిక్ ‘డాన్’ పాత్రను రణ్వీర్ సింగ్‌తో ప్రెజెంట్ చేయాలని ప్లాన్ చేశాడు స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఫర్హాన్ అక్తర్. అందుకోసం రణ్వీర్‌కు పది కోట్ల రూపాయల భారీ అడ్వాన్స్ కూడా ఇచ్చారు.ఇక సినిమా కోసం దాదాపు రెండేళ్లకు పైగాప్రీ-ప్రొడక్షన్ పనులు జరిగాయి కూడా.అయితే స్క్రిప్ట్ వర్క్ ఆలస్యం కావడం, రణ్వీర్ సింగ్ సూచించిన కొన్ని స్క్రిప్ట్ చేంజెస్ కి డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ నో చెప్పడంతో ఇద్దరి మధ్య క్లాషెస్ మొదలయ్యాయ్.దీంతో ఇక ఈ సినిమా నేను చేయలేనంటూ తప్పుకున్నాడు రణ్వీర్‌.

రణ్వీర్‌పై మూడేళ్ల పాటు బ్యాన్

Advertisement

దీంతో హీరో ఇలా ప్రాజెక్ట్ నుండి ఉన్న పళంగా తప్పుకోవడంతో ప్రొడక్షన్ హౌస్ కి బాగా లాస్ వచ్చిందని ఫైర్ అయ్యాడు ఫర్హాన్. ప్రీ-ప్రొడక్షన్ కోసం చేసిన ఖర్చులు,అలాగే సినిమా కోసం ఇతర నటీనటులకి, అంతర్జాతీయ టెక్నీషియన్ల డేట్లు బుక్ చేసుకుని అడ్వాన్సులు ఇవ్వడం వల్ల దాదాపు 45 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నది ఫర్హాన్ ఆర్గ్యుమెంట్.దీంతో ఆయన ఎఫ్‌డబ్ల్యుఐసిఈ (FWICE) సంఘంలో కంప్లైంట్ చేయగా రెండు వైపులా వాదనలు విన్న FWICE రణ్వీర్‌పై మూడేళ్ల పాటు బ్యాన్ వేసింది.

also read :జగ్గూభాయ్ డబ్బింగ్ వీడియో వైరల్.. అప్పల సూరిగా థియేటర్లలో పూనకాలే!

అయితే ఇలా బ్యాన్ వేయడం బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్తేమీ కాదండోయ్.. గతంలో ‘హేరా ఫేరీ 3’ సినిమా విషయంలో కూడా ఇలాంటి పెద్ద రగడే నడిచింది. అప్పట్లో అగ్రిమెంట్ల ప్రకారం పరేష్ రావల్, అక్షయ్ కుమార్ లు నష్టపరిహారం కింద అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేసి కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ వేసేశారు. అయితే ఇక్కడ కూడా రణ్వీర్ సింగ్ కూడా తాను తీసుకున్న 10 కోట్ల అడ్వాన్స్‌ను వెనక్కి తిప్పి ఇచ్చేశాడు. కానీ ఫర్హాన్ అక్తర్ మాత్రం 45 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని మొండిగా ఉన్నాడు. అసలు స్క్రిప్టే పూర్తి కానప్పుడు అంత ఖర్చు ఎలా అవుతుందని, అంత మొత్తం ఇవ్వడం కుదరదని స్పష్టం చేస్తున్నాడు రణ్వీర్. ఈగోలకు పోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందని రణ్వీర్ లీగల్ టీమ్ భావిస్తోందని తెలుస్తుంది.

బ్యాన్ తప్పించుకుంటాడా లేక  దూరంగా ఉంటాడా !

మరోవైపు రణ్వీర్ ఎదుగుదలను ఓర్వలేని కొందరు కావాలనే కుట్ర పూరితంగా ఈ వివాదాన్ని పెద్దది చేసి బ్యాన్ వరకూ తీసుకెళ్లారని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు రణ్వీర్ ఫ్యాన్స్.ఏది ఏమైనా వరుస సక్సెస్ లతో బాలీవుడ్ టాప్ చైర్ కి గురి పెట్టిన రణ్వీర్ కి ఈ బ్యాన్ పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి.చూడాలి మరి  45 కోట్ల నష్టపరిహారం చెల్లించి బ్యాన్ తప్పించుకుంటాడా లేక మూడేళ్ళపాటు సినిమాలకి దూరంగా ఉంటాడా !

also read :స్టార్ హీరోలకే దిక్కులేదు… కిరణ్ అబ్బవరం వంద కోట్లు కొడతాడా?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×