Chennai Love Story: గతంలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బాక్సాఫీస్ కళకళ లాడిపోయేది.ఎలా లేదన్న మినిమం వసూళ్లతో గట్టెక్కిపోయేవారు ప్రొడ్యూసర్స్,కాని కాలం మారింది.కనక వర్షం కాదు కదా కనీస వసూళ్లు వస్తే బాగుండు అనుకునే పరిస్థితి. కంటెంట్ లో ఏ మాత్రం తేడా కొట్టినా వీకెండ్ దాటకముందే థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇలా పెద్ద హీరోల సినిమాలే అష్టకష్టాలు పడుతుంటే, చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాలు బయట పడటానికి నానా తిప్పలు పడుతున్నాయి. ప్రేక్షకుడికి అసలు ఇలాంటి ఒక సినిమా వస్తుందనే విషయం తెలియడానికే నిర్మాతలు పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న సినిమా ఏకంగా వంద కోట్లని టార్గట్ చేయడం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అతివిశ్వాసమా లేక పబ్లిసిటీ స్టంటా
అదే …కిరణ్ అబ్బవరం హీరోగా రాబోతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా. ఈ సినిమాను సాయిరాజేష్, ఎస్‌కేఎన్, ధీరజ్ మొగలినేని కలిసి నిర్మించారు. అయితే తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో నిర్మాత ధీరజ్ మొగలినేని స్టేజ్ ఎక్కి చాలా డాషింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ సినిమాతో తాము బాక్సాఫీస్ దగ్గర వంద కోట్లు కొడుతున్నామని, ఈ ఏడాది విడుదలయ్యే లవ్ స్టోరీల్లో తమదే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఓపెన్ గానే అనౌన్స్ చేసేశాడు. మరి ఇది అతివిశ్వాసమో లేక పబ్లిసిటీ స్టంటో ఆయనకే తెలియాలి.
also read :పెళ్లి కంటే కుక్కను పెంచుకోవడం బెటర్….టాలీవుడ్ బ్యూటీ బోల్డ్ స్టేట్‌మెంట్!
కిరణ్ అంత స్టామినా ఉందా?
మరి కిరణ్ గత చిత్రాల ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయనకి వంద కోట్లు కొల్లగొట్టే స్టామినా ఉందా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద స్టేట్‌మెంట్ ఇవ్వడం కాస్త టూమచ్‌గానే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ‘రూల్స్ రంజన్’, ‘మీటర్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాలు అందుకున్నాయో అందరికీ తెలిసిందే.అయితే మేకర్స్ కాన్ఫిడెన్స్ కి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది.
పాటలు బాగుంటే వంద కోట్లు వచ్చేస్తాయా
గతేడాది జూలై 2023లో వచ్చిన ‘బేబీ’ సినిమా టాలీవుడ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెల్సిందే .కేవలం చిన్న సినిమాగా వచ్చి, యూత్‌కు కనెక్ట్ అయ్యే కంటెంట్‌తో దాదాపు 90 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరికి పెద్ద షాకే ఇచ్చింది. ఆ ‘బేబీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి రాజేషే ఇప్పుడు ఈ ‘చెన్నై లవ్ స్టోరీ’కి కథ అందించారు. దాంతో ఆడియన్స్‌లో ఆయన బ్రాండ్ ఇమేజ్‌పై కాస్త గురి ఉంది. పైగా ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఇన్‌స్టంట్ హిట్‌గా నిలిచాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం రాబోయే మరో ఐదు పాటలు కూడా అంతకంటే అద్భుతంగా ఉండబోతున్నాయట. ఆడియో పరంగా సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తున్నా, కేవలం పాటలు బాగున్నంత మాత్రాన వంద కోట్లు వచ్చేస్తాయా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.
also read :డబ్బు లేదనే చెప్పుతో కొట్టాడు.. ఆ కసితోనే కోట్లు సంపాదించా.. బండ్ల గణేష్ ఓపెన్ టాక్
మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా
అప్పుడెప్పుడో సిద్ధార్థ్ ‘బొమ్మరిల్లు’ లేదా శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్,తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు లాంటి సినిమాలు మ్యూజికల్ గా, కంటెంట్ పరంగా క్లిక్ అయి కాసుల వర్షం కురిపించాయి. కానీ అప్పటి రోజులు వేరు, ఇప్పటి ఓటీటీ కాలం వేరు. ప్రేక్షకుడు థియేటర్‌కు రావాలంటే సాంగ్స్ తో పాటు సాలిడ్ కంటెంట్ కూడా కావాలి.మరి ‘చెన్నై లవ్ స్టోరీ’ మేకర్స్ నమ్ముతున్నట్టుగా ‘బేబీ’ సెంటిమెంట్ వర్కవుట్ అయి బాక్సాఫీస్ దగ్గర మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేదా అనేది కాలమే డిసైడ్ చేయాలి.