E-Paper
Advertisement

ఏసీ, కూలర్లు లేకున్నా.. పాత ఇళ్లు ఎందుకంత చల్లగా ఉంటాయ్? పూర్వీకుల ‘ఇంటి గుట్టు’ ఇదే!

ఏసీ, కూలర్లు లేకున్నా.. పాత ఇళ్లు ఎందుకంత చల్లగా ఉంటాయ్? పూర్వీకుల ‘ఇంటి గుట్టు’ ఇదే!
Advertisement

Old Houses Cooling: ఈ రోజుల్లో ఎండ కాస్త పెరిగితే చాలు.. చాలా మంది వెంటనే ఏసీ ఆన్ చేస్తున్నారు. గోడల నుంచి వచ్చే సెగను తట్టుకోలేక.. చల్లటి గాలి కోసం పరితపించిపోతున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని పాత ఇళ్లు.. బయట ఎంత ఎండ ఉన్నప్పటికీ లోపల ఏసీ లాంటి చల్లదనాన్ని అందిస్తుంటాయి. పల్లెల్లోని తాత, అమ్మమ్మల ఇంటికి వెళ్లినప్పుడు ప్రతీ ఒక్కరూ ఈ అనుభూతిని పొందే ఉంటారు. ఏసీ, కూలర్ లేకున్నా పాత కాలపు ఇళ్లు అలా ఎలా చల్లగా ఉండేవి? వాటి వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

మట్టి, సున్నం మహిమ

ప్రస్తుతం 95 శాతం మంది తమ ఇళ్లను కాంక్రీట్, సిమెంట్, ఇటుకలతో నిర్మిస్తున్నారు. అయితే ఇవి వేడిని త్వరగా పీల్చుకొని.. ఇంట్లోకి పంపిస్తాయి. కానీ పాతకాలపు ఇళ్ల గోడలు ఒకటి రెండు అడుగుల మందంతో ఉండేవి. పైగా వాటిని మట్టి, సున్నం, బెల్లం పాకం, కరక్కాయల మిశ్రమంతో కట్టేవారు. ఈ సున్నపు మిశ్రమానికి గాలిలోని తేమను పీల్చుకుని ఇళ్లను చల్లబరిచే గుణం సహజంగానే ఉంటుంది. కాబట్టి మందపాటి గోడల వల్ల బయటి వేడి లోపలికి రావడానికి చాలా సమయం పట్టేది. రాత్రి అయ్యేసరికి బయట వాతావరణం చల్లబడుతుంది కాబట్టి ఇల్లు ఎప్పుడూ నార్మల్ టెంపరేచర్‌లోనే ఉండేది.

ఎత్తైన పైకప్పులు

Advertisement

పాత ఇళ్లను గమనిస్తే వాటి దూలాలు, పైకప్పులు చాలా ఎత్తులో ఉంటాయి. దీని వెనుక ఒక సింపుల్ సైన్స్ ఉంది. వేడి గాలి ఎప్పుడూ తేలికగా ఉంటూ ఎల్లప్పుడూ పైకే ప్రయాణిస్తాయి. కాబట్టి పాత ఇళ్లల్లోని గదుల్లో వేడి గాలి పైకి పోవడానికి ఎత్తైన సీలింగ్స్ సహాయపడేవి. కింద ఉండే మనుషులకు కేవలం చల్లని గాలి మాత్రమే తగిలేది. దీంతో వారు ఎంత వేడి ఉన్నప్పటికీ హాయిగా జీవించేవారు.

వెలుతురునిచ్చే ‘నడిమిశాల’

అప్పట్లో ఇళ్లను చతురస్రాకారంలో కట్టి ఇంటి మధ్యలో ఖాళీ స్థలాన్ని అట్లే వదిలేసేవారు. దీని పైభాగం ఓపెన్ గా ఉంచేవారు. అలాగే ఇంటి వెనుక పెద్ద పెరటిని తాతముత్తాతలు మెయిన్ టెన్ చేసేవారు. దీనివల్ల ఇంటి లోపలికి గాలి బాగా వచ్చి.. వేడి గాలి మాత్రం పైనున్న ఓపెన్ ప్లేస్ గుండా బయటకు పోయేది. పెరట్లోని చెట్ల నుంచి వచ్చే చల్లని గాలి ఇల్లంతా వ్యాపించేది. దీన్నే ‘క్రాస్ వెంటిలేషన్’ అంటారు. దీని వల్ల ఇల్లు ఎప్పుడూ చల్లటి గాలి తగులుతూ ఎంతో హాయిగా ఉండేవి.

మట్టిపెంకులు, తాటి దూలాలు

Advertisement

ఇప్పటి కాంక్రీట్ స్లాబులు సూర్యుడి ఎండను నేరుగా పీల్చుకుని రాత్రి పూట కూడా ఇళ్లను సెగలు గక్కేలా చేస్తున్నాయి. కానీ పాత కాలంలో మట్టి పెంకులు, తాటి దూలాల సాయంతో ఇంటి పైకప్పును నిర్మించేవారు. ఫలితంగా మట్టి పెంకులు వేడిని లోపలికి రానివ్వకుండా అడ్డుకునేవి. అలాగే పెంకుల మధ్య ఉండే చిన్న చిన్న ఖాళీల ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన వేడి గాలి బయటకు వెళ్లిపోయేది.

Also Read: ఇంటర్నల్ మెమరీ vs SD కార్డ్.. మీ స్మార్ట్‌ఫోన్‌కు ఏది ఉంటే బెస్ట్?

చుట్టూ చెట్లు.. పెద్ద అరుగులు

అప్పట్లో ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వదిలి పెద్ద పెద్ద వేప చెట్లు, మామిడి చెట్లు నాటేవారు. ఇంటి ముందు పెద్ద అరుగులు, బాల్కనీలు సైతం నిర్మించేవారు. ఈ అరుగులు సూర్యుడి ఎండ నేరుగా గోడలపై పడకుండా నీడను ఇచ్చేవి. మరోవైపు చెట్ల నుంచి వచ్చే చల్లటి గాలి ఇంట్లోకి ప్రవేశిస్తూ ఇంటిని ఏసీ గదిలా మార్చేసేవి. తాత ముత్తాతలు అనుసరించిన క్రాస్ వెంటిలేషన్, సున్నపు గోడలు, చెట్లను పెంచడం లాంటివి చేస్తే.. ఏసీల అవసరం లేకుండానే ఇంటిని కూల్ గా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఛార్జర్‌ను ఎప్పుడూ ప్లగ్‌లోనే ఉంచుతున్నారా? కొంపలు అంటుకుంటాయ్ భయ్యా!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×