E-Paper
Advertisement

Dhurandhar Trailer:యాక్షన్ మూవీగా రణవీర్ సింగ్  ‘ధురంధర్’ ..ట్రైలర్ రిలీజ్

Dhurandhar Trailer:యాక్షన్ మూవీగా రణవీర్ సింగ్  ‘ధురంధర్’ ..ట్రైలర్ రిలీజ్
Advertisement

Dhurandhar Trailer:  బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) త్వరలోనే ధురంధర్ సినిమా(Dhurandhar Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 5వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్ అమాంతం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేస్తుంది. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో వైరల్ అవుతుంది.

అంచనాలు పెంచిన ట్రైలర్..

ఈ సినిమాకు నేషనల్ అవార్డు గ్రహీత ఆదిత్య ధర్ (Aditya Dhar)దర్శకత్వం వహించటం విశేషం. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఒక స్పై-యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో రణవీర్ సింగ్ ఒక రా ఏజెంట్‌గా కనిపిస్తారు. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ (Madhavan) కూడా నటించిన సంగతి తెలిసిందే. మాధవన్ ఈ సినిమాలో  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్రలో నటిస్తున్నారు. ఇదివరకే మాధవన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా అర్జున్ రాంపాల్ వంటి తదితరులు కూడా కీలకపాత్రలలో కనిపించబోతున్నారు.

నేషనల్ అవార్డు గ్రహీత..

Advertisement

ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దర్శకుడు ఆదిత్య దర్శకత్వంలో ధురంధర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా జ్యోతి దేశ్‌పాండే , లోకేష్ ధర్ ఆదిత్య ధర్ బి62 స్టూడియోస్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాలో రణవీర్ సింగ్ జోడిగా సారా అర్జున్(Sara Arjun) నటించబోతున్నారు. గతంలో విక్రమ్ నటించిన ‘నాన్న’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించిన సారా అర్జున్ ఇప్పుడు ఏకంగా రణవీర్ సింగ్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుంది? ప్రేక్షకులు అంచనాలను చేరుకోగలదా అనే విషయాలు తెలియాలి అంటే డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఎదురుచూడాల్సిందే. ఇక రణవీర్ సింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. వరుస హిట్టు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రణవీర్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Also Read: Varanasi Movie: ప్రమోషన్ల కోసమే రూ.200 కోట్లు.. అసలేం ప్లాన్ చేస్తున్నావ్ జక్కన్న?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×