E-Paper
Advertisement

Hyderabad News: మా టార్గెట్ ఫిక్స్.. అంతా కేంద్రం చేతుల్లో, రీజినల్ అర్బన్ డెవలప్‌మెంట్ మీటింగ్‌లో సీఎం

Hyderabad News: మా టార్గెట్ ఫిక్స్.. అంతా కేంద్రం చేతుల్లో, రీజినల్ అర్బన్ డెవలప్‌మెంట్ మీటింగ్‌లో సీఎం
Advertisement

Hyderabad News:  2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వ సహకారం కావాలన్నారు. నగర అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి ఖట్టర్‌ని ఈ సందర్భంగా కోరారు.

పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల ప్రాంతీయ సమావేశం

Advertisement

మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని హోటల్ ITC కోహినూర్‌లో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల ప్రాంతీయ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తోపాటు దక్షిణ-పశ్చిమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి, మా రాష్ట్ర ప్రణాళికలు ఇప్పటికే కేంద్రానికి పంపించామన్నారు. కేంద్రం వేగంగా అనుమతులు ఇచ్చిసహకరించాలని కోరారు. డిసెంబర్ 9న 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రెజెంట్ చేయబోతున్నామని తెలిపారు. తెలంగాణ..  దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే మా ఆలోచన విధానమన్నారు.

Advertisement

ఆలోచనను బయటపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి

మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలన్నారు ముఖ్యమంత్రి.  రాబోయే ఏడాదిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ సిటీకి తీసుకురావాలని ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు.

2034 నాటికి ఓ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నామని వివరించారు.  హైదరాబాద్ సిటీ అభివృద్ధితోపాటు భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని, మా పోటీ ఇతర రాష్ట్రాల నగరాలతో కాదని తేల్చిచెప్పారు.

ALSO READ:  జూనియర్ కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థుల మధ్య ఫైటింగ్

మా పోటీ కేవలం సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతో ఉంటుందన్నారు సీఎం రేవంత్. అందుకు కేంద్ర ప్రభుత్వ నుంచి సహకారం అవసరమన్నారు. హైదరాబాద్‌ సిటీ వివిధ రంగాలకు హబ్‌గా మారిందన్నారు. దేశంలో ప్రతీ సీఎంకు ప్రధాని పెద్దన్న లాంటివారని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు.  దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×