E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 లో టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 లో టాప్ 5  కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?
Advertisement

Bigg Boss 9 Telugu : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ రియాల్టీ షో అంటే టక్కున గుర్తొచ్చేది బిగ్ బాస్. 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 9వ సీజన్ జరుపుకుంటుంది. ఈ సీజన్ కూడా 10 వారాలు పూర్తిచేసుకుని 11వ వారంలోకి అడుగు పెట్టింది.. కొన్ని రోజుల్లోనే ఈ సీజన్ కు శుభం కార్డు పడబోతుంది. గత వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అయితే ప్రస్తుతం హౌస్ లో చాలామంది కంటెస్టెంట్స్ ఉండడంతో ఈవారం కూడా డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఇప్పటికే నామినేషన్స్ పూర్తి కావడంతో ఇద్దరు బయటకు వెళ్తారని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. మరి 11 వ వారం డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు? ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో టాప్ 5 ఎవరు ఉన్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

11వ వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్..

బిగ్ బాస్ సీజన్ 9 11 వ వారానికి చేరుకుంది. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది.. వాడి వేడిగా కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో గొడవలు కూడా జరిగాయి. హౌస్ లో ఎవరికి వారే అన్నట్లుగా గొడవలకు కాలు రువ్వారు.. మొత్తానికి 11వ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. నామినేషన్స్ సందర్భంగా ఇమ్మూ-భరణి మధ్య, అలాగే దివ్య-రీతూ చౌదరి మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగింది.. ఇక ఈ వీక్ నామినేషన్ చూస్తే.. ఆరుగురు నామినేషన్స్ లోకి వచ్చారు. ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ పడాల, భరణి, సంజన, డెమాన్ పవన్, దివ్య. అయితే ఈ వారం అందరికంటే ఎక్కువ నామినేషన్లు పడ్డ రీతూ చౌదరి నామినేషన్స్ నుంచి సేవ్ కావడం విశేషం.. తనూజ రీతూను సేవ్ చేసింది. మొత్తానికి రీతూ సేఫ్ జోన్లో ఉంది.

డేంజర్ జోన్లో ఉన్నది ఎవరంటే..?

Advertisement

బిగ్ బాస్ 11వ వారం నామినేషన్స్ ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్లలో ఆరుగురు నామినేషన్లో ఉన్నారు. అందులో రీతూ సేఫ్ అయ్యింది. నెక్స్ట్ డేంజర్ లో ఉన్నది దివ్య, సంజన ఉన్నట్లు తెలుస్తుంది. కళ్యాణ్ కూడా ఈ మధ్య సరిగ్గా పెర్ఫార్మన్స్ ఇవ్వలేదనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఈవారం కూడా డబల్ ఎలిమినేషన్ గనుక ఉంటే కచ్చితంగా వీరి ముగ్గురిలోంచి ఇద్దరు హౌస్ నుంచి బయటికి వెళ్లిపోతారు..

Also Read : ‘వారణాసి’లో హనుమంతుడి పాత్రలో స్టార్ హీరో.. జక్కన్న ప్లాన్ మాములుగాలేదుగా..

టాప్ 5 లో కంటెస్టెంట్లు వీళ్లే…

Advertisement

బుల్లితెర ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో శుభం కార్డు వేసుకోబోతుంది.. ఈ క్రమంలో 11వ వారం నామినేషన్స్ హీటెక్కించాయి. మొత్తానికి ఆరుగురు నామినేషన్స్ లోకి వచ్చేసారు.. ఎక్కువమంది రీతు చౌదరిని నామినేట్ చేయగా.. తనూజ ఆమెను సేవ్ చేసింది.. ఇక ఐదుగురు మాత్రమే నామినేషన్స్ లో ఉన్నారని తెలుస్తుంది.. వీరిలో దివ్య, సంజన, కళ్యాణ్ లలో ఎవరొకరు బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఇక హౌస్ లో ఉన్న వారిలో టాప్ 5 లో తనూజ, ఇమ్మానుయేల్, డెమాన్ పవన్, సుమన్ శెట్టి, భరణి ఉన్నారని ఓటింగ్ ను చూస్తే తెలుస్తుంది. తనుజ విన్నర్ రేస్ లో ఉంది. మరి ఈ సీజన్ కి విన్నర్ గా ఈమెని అవుతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అటు ఇమ్ము కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. మరి విన్నర్ గా ఎవరు అవుతారో తెలియాలంటే ఈ సీజన్ పూర్తయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×