E-Paper
Advertisement

Ranveer Singh: రణవీర్ సింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్.. పోలీసులను ఆశ్రయించిన నటుడు!

Ranveer Singh: రణవీర్ సింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్.. పోలీసులను ఆశ్రయించిన నటుడు!
Advertisement

Ranveer Singh: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు రణవీర్ సింగ్ (Ranaveer Singh)ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇటీవల ధురంధర్ (Dhurandhar)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు ఈ సినిమా ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.. ఈ సినిమా మంచి సక్సస్ కావడంతో చిత్ర బృందం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేసింది . ఇక ధురంధర్ 2 సినిమాని మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

కోట్లాది రూపాయల డబ్బులు డిమాండ్..

ఇలా చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో హీరో రణవీర్ సింగ్ కు ఊహించని ప్రమాదం ఎదురవుతుందని తెలుస్తోంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ వాయిస్ మెసేజ్ వచ్చిందని తెలుస్తుంది. కోట్లాది రూపాయలు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామంటూ ఈయనకు బెదిరింపులు రావడంతో వెంటనే రణవీర్ సింగ్ ముంబై పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసుల కేసు నమోదు చేసుకుని నింతుడి వివరాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

బెదిరింపులతో బాలీవుడ్ ఉక్కిరి బిక్కిరి..

Advertisement

ఇలా రణవీర్ సింగ్ కు ప్రమాదం పొంచి ఉందనే విషయం తెలియడంతో ఆయన అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శక హీరోల ఇండ్లపై కాల్పులు జరుగుతున్న ఘటనలతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే నటుడు రణవీర్ సింగ్ కు కూడా బెదిరింపులు రావడంతో ఒక్క సారిగా అలర్ట్ అవుతూ వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

ప్రమాదంలో దీపికా పదుకొనే..

Advertisement

ఇలా రణవీర్ సింగ్ ప్రమాదంలో ఉన్నారనే విషయం తెలిసిన అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గతంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి బెదిరింపులు రావడంతో సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్ళినా హై సెక్యూరిటీతోనే బయటకు వెళ్తున్నారు. ప్రస్తుతం రణవీర్ సింగ్ పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలుస్తోంది. ఇక ఈయన కెరియర్ పరంగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా రణవీర్ సింగ్ కు బెదిరింపులు వచ్చినప్పటికీ ఆయన భార్య దీపిక పదుకొనేకు కూడా ప్రమాదం పొంచి ఉందని తెలుస్తుంది.

Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడి వెంకీ సినిమా టైటిల్ ఇదే..క్రేజీగా ప్లాన్ చేసిన డైరెక్టర్!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×