Ranveer Shiva: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తన కెరీర్‌లో మరో భారీ సాహసానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ రచయిత అమీష్ త్రిపాఠి రచించిన ప్రసిద్ధ నవల ‘ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహా’ (The Immortals of Meluha) ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో రణవీర్ శివుడి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సోషియో-ఫాంటసీ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.
Read also-రామ్ చరణ్ ‘పెద్ది’ స్టోరీ ఇదే అయితే.. మరీ ఇంత సింపుల్‌గా ఉంటే ప్రేక్షకులు చూస్తారా?
తాజా సమాచారం ప్రకారం, ఈ నవలను వెండితెరపై ఆవిష్కరించేందుకు రణవీర్ సింగ్ స్వయంగా భారీ మొత్తాన్ని వెచ్చించి హక్కులను కొనుగోలు చేశారు. కేవలం నటుడిగానే కాకుండా, తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నించినప్పటికీ, చివరకు రణవీర్ దగ్గరికే ఈ కథ చేరింది.
అమీష్ త్రిపాఠి రాసిన ‘శివ ట్రిలోజీ’లో మొదటి పుస్తకమే ‘ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహా’. దీనిని ఒక సినిమాటిక్ యూనివర్స్ తరహాలో మూడు భాగాలుగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ గ్రాఫిక్స్‌తో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం రణవీర్ సింగ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందువల్ల, ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులకు, స్క్రిప్ట్ తుది మెరుగులకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, ఈ చిత్రం 2028లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అప్పటికి భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ కథను సిద్ధం చేయనున్నారు. ఒకప్పుడు ఈ నవల హక్కులను కొనాలని తనకు సూచనలు వచ్చాయని, అయితే ఆ సమయంలో తాను శివుడి వంటి బరువైన పాత్రను పోషించగలనా అనే సందేహంతో వెనకడుగు వేశానని అక్షయ్ కుమార్ గతంలో వెల్లడించారు.
Read also-Darshini Gowda: సీరియల్స్ లో పద్ధతి.. బయట చాలా హాట్ గురు .. గ్లామర్ లుక్ లో రచ్చ..
ఇప్పుడు రణవీర్ సింగ్ ఆ సవాలును స్వీకరిస్తుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పురాణాలను, ఫాంటసీని కలగలిపి అమీష్ త్రిపాఠి సృష్టించిన ఈ అద్భుత ప్రపంచం వెండితెరపై ఎలా ఉంటుందో అని అటు పుస్తక ప్రేమికులు, ఇటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శివుడి పాత్రలో రణవీర్ సింగ్ ఎనర్జీ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.