E-Paper
Advertisement

ట్రంప్ మరోసారి హెచ్చరికలు.. వలసదారులకు-టారిఫ్‌లకు లింకు, తేడా వస్తే 25 శాతం

ట్రంప్ మరోసారి హెచ్చరికలు..  వలసదారులకు-టారిఫ్‌లకు లింకు, తేడా వస్తే 25 శాతం
Advertisement

Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిత్యం మూడు విషయాలపై ప్రధానంగా మాట్లాడుతున్నారు. టారిఫ్, వలసదారులు, ఇరాన్ యుద్ధం ఈ మూడు చుట్టూనే నిత్యం ఏదో విధంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాజాగా అక్రమ వలసదారులపై తమ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని మరోసారి స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

ట్రంప్ మరోసారి హెచ్చరికలు..

Advertisement

అంతేకాదు అమెరికా బహిష్కరించిన పౌరులను ఆయా దేశాలు వెనక్కి తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలను టారిఫ్‌లతో హెచ్చరించామని, చివరకు ఆ దేశాలు తమదారికి వచ్చాయని వ్యాఖ్యానించారు. రాత్రి వైట్‌హౌస్‌లో పోలీస్ వీక్ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ వ్యాఖ్యలు చేశారు.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 2 లక్షల మంది నేరస్థులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాంటి వారిని జైళ్లలో పెడుతున్నామని, లేకుంటే వారు వచ్చిన దేశాలకే తిరిగి పంపిస్తున్నామన్నారు. కొన్ని దేశాలు తమ దేశ పౌరులను తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నాయని, మాకు వాళ్లు వద్దు..తీసుకోమని మొండికేస్తున్నాయని చెప్పుకొచ్చారు.

Advertisement

వలసదారులకు-టారిఫ్‌లకు లింకు, తేడా వస్తే 25 శాతం

అలాంటి దేశాలపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తామని మనసులోని మాట బయటపెట్టారు. ఆయా దేశాలు మాకు ఫోన్ చేసి వారిని తిరిగి పంపాలని కోరుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ పద్ధతి చాలా బాగా పని చేసిందన్నారు. ఏడాది కాలంలో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సుమారు 6,15,000 మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించిందన్నారు.

దక్షిణ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్క అక్రమ వలసదారుడిని దేశంలోకి అనుమతించలేదని కుండబద్దలు కొట్టేశారు. ఇక అమెరికాను పట్టి పీడిస్తున్న ఫెంటనిల్ డ్రగ్ స్మగ్లింగ్ గురించి నోరు విప్పారు. సరిహద్దుల ద్వారా జరిగే ఈ డ్రగ్ సరఫరా దాదాపు 60 శాతానికి పైగా తగ్గిపోయిందన్నారు. సముద్ర మార్గం ద్వారా జరిగే స్మగ్లింగ్ 97 శాతం పడిపోయిందన్నారు.

ALSO READ: అమెరికా-ఇరాన్ వార్.. పాకిస్థాన్ డబుల్ గేమ్? బాంబు పేల్చిన CBS న్యూస్

ఆ తరహా విజయాలు అమెరికా చట్టాల వల్లే సాధ్యమయ్యాయని చెప్పుకొచ్చారు. ఐసీఈ, హోంల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ మార్షల్స్, ఏటీఎఫ్, ఎఫ్‌బీఐతో పాటు స్థానిక పోలీసుల సేవలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వారంతా అద్భుతమైన దేశభక్తులు, అద్భుతమైన వ్యక్తులుగా అభివర్ణించారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×