E-Paper
Advertisement

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?
Advertisement

Rasha Thadani:రషా థడానీ…రవీనా టాండన్ కుమార్తె గా బాలీవుడ్ లో ఆజాద్ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ నెపోకిడ్ పెద్ది సినిమాతో చరణ్ సరసన టాలీవుడ్ లోకి అడుగు పెడుతుందని అనుకున్నారంతా.కానీ కారణాలేవైనా ఆ స్థానాన్ని కబ్జా చేసింది జాన్వీ పాప.ఇక నందమూరి మోక్షు తో ఖచ్చితంగా తెలుగు లోకి ఎంట్రీ ఇస్తుందని కోడై కూసింది ఇండస్ట్రీ.అయితే అసలు ఆ సినిమా పట్టాలే ఎక్కకపోవడంతో మరింత కాలం వెయింటింగ్ లీస్ట్ లో ఉండేలా తప్పలేదు ఈ భామకి.

అయితే ఇక వెయిటింగ్ ఈజ్ ఓవర్ అంటూ ఎట్టకేలకి జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, ‘మహాసముద్రం’, ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఇక ఈ సినిమా జూలై 30న థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ యూనిట్.అందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలతో హోరేత్తిస్తుంది ఈ నయా జోడీ.

Advertisement

ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టిన రషా

ఇక ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో రషా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టింది.తాను తెలుగులో మొదటిసారి సినిమా చేస్తున్నానని, అయితే తనకి భాష తెలీకపోవడంతో చాలా భయపడ్డానని,షాకింగ్ విషయాలను,సరదా అనుభవాలను పంచుకుంది. మొదటిసారి తెలుగు సినిమా చేస్తుండటంతో భాష తెలియక గాల్లో దీపంలా భయపడ్డానని,డైరెక్టర్ అజయ్ భూపతి ప్రతి సీన్ హిందీలో వివరంగా చెప్పి, నేచురల్ ఎమోషన్స్ రావడం కోసం చాలా ఓపికగా టైమ్ ఇచ్చారని మనసుల్ని ఆనందాన్ని బయటపెట్టింది.

Advertisement

ఇక తనకూ హీరో జయకృష్ణతో బాండింగ్ గురించి చెప్తూ… బయటికి చాలా సైలెంట్‌గా అమాయకుడిలా కనిపిస్తాడు కానీ, షూటింగ్ గ్యాప్‌లో సెట్స్‌లో మాత్రం ఆగం ఆగం చేస్తూ విపరీతంగా అల్లరి చేసేవాడని నవ్వుతూ అసలు విషయం చెప్పేసింది ఈ బాంబే బ్యూటీ. ఇక ఖాళీ సమయంలో లూడో, చెస్ లాంటి బోర్డ్ గేమ్స్ ఆడుతుంటే జయకృష్ణ ప్రతీసారీ తనని చీటింగ్ చేసేవాడని జయకృష చేసిన చిలిపి పనులని బయటపెట్టేసింది రషా.

నువ్వు మాత్రం త్వరగా తెలుగు నేర్చుకో

ఇక ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక అద్భుతమైన అనుభవమని, తన తల్లి రవీనా టాండన్‌తో గతంలో పనిచేసిన రోజులను, నాటి జ్ఞాపకాలను మోహన్ బాబు గారు గుర్తుచేయడం అసలు మర్చిపోలేనని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఇక నటన విషయంలో తన తల్లి ఎలాంటి సలహాలు సూచనలు ఏమీ ఇవ్వలేదని,టాలీవుడ్ లో మంచి వాతావరణం ఉంటుందని,కానీ నువ్వు మాత్రం త్వరగా తెలుగు నేర్చుకో అన్న సలహా మాత్రం ఇచ్చిందని చెప్పుకొచ్చింది.ఇక తన తండ్రి అనిల్ థడానీకి హైదరాబాద్‌లో ఎలాగైనా స్థిరపడాలనే పెద్ద ఆశ ఉండేదని , అందుకే తన కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందనేసరికి ఇంట్లో అందరికంటే నాన్నే ఎక్కువగా ఎగ్జైట్ అయ్యారని తెలిపింది.

ఇక ఈ సినిమాలో తన క్యారెక్టర్ పేరు ‘మంగ’ అని, రియల్ లైఫ్‌లో తాను ఎంత నాటీగా, ఎనర్జెటిక్‌గా ఉంటానో ఈ రోల్ కూడా అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చారని, ఇందులో ఉన్న ఆరు పాటలూ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటాయని చెబుతూ, ప్రత్యేకంగా ‘మంగ మంగ’ సాంగ్ తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ అని స్పష్టం చేసింది.

కుర్ర జోడికి ఎలాంటి స్వాగతం పలుకుతుందో !

ఇక రషా సినిమాల విషయానికి వస్తే అజయ్ దేవ్ గణ్ మేనల్లుడు అమన్ దేవ్ గణ్ హీరోగా లాంచ్ అయిన ఆజాద్ సినిమాతో ఈ అమ్మడు కూడా గ్రాండ్ గానే లాంచ్ అయింది,అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో కాస్త స్లో అయిన ఈ సుందరి ఇపుడు శ్రీనివాస మంగాపురంతో మరోసారి అతనా అదృష్టాన్ని పరిక్షించుకుంటుంది.చూడాలి మరి జూలై 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఈ కుర్ర జోడికి ఎలాంటి స్వాగతం పలుకుతుందో !

Related News

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

Big Stories

Advertisement
×