E-Paper
Advertisement

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!
Advertisement

Best Air Purifiers: వాతావరణ మార్పుల వలన ప్రస్తుతం మనం పీలుస్తున్న గాలి కూడా అంత ప్యూర్‌గా ఏమీ ఉండటం లేదు. ఇంట్లో ఉన్నా కూడా దుమ్ము, ధూళి, పొగ వల్ల చాలామందికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. అందుకే ఈ మధ్య ప్రతీ ఇంట్లోనూ ‘ఎయిర్ ప్యూరిఫైయర్’ ముఖ్యమైన సాధనంగా మారిపోయింది. అయితే మార్కెట్లో రకరకాల ప్యూరిఫైయర్లు దొరుకుతున్నాయి కదా అని ఏది పడితే అది కొనేస్తే.. అసలుకే ఎసరు వస్తుంది. అందుకే మీ డబ్బులు బూడిదలో పోసిన పన్నీరు కాకూడదంటే.. ఒక మంచి ప్యూరిఫైయర్ ఎంచుకునేటప్పుడు ఈ విషయాలను జాగ్రత్తగా గమనించాలి.

గది సైజుకి తగ్గ ప్యూరిఫైయర్:

ఎయిర్ ప్యూరిఫైయర్‌ని ఏ రూమ్‌లో పెట్టాలనుకుంటున్నారో ముందుగా ఆ గది వైశాల్యాన్ని సరి చూసుకోవాలి. చిన్న బెడ్‌రూమ్‌ కోసం డిజైన్ చేసిన ప్యూరిఫైయర్‌ని పెద్ద హాల్‌లో పెడితే అది గాలిని సరిగ్గా శుభ్రం చేయలేదు. అందుకే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్‌లో కంపెనీ చెప్పిన రూమ్ సైజ్ కవరేజ్‌ని, మీ గది కొలతలతో పోల్చి చూసుకున్నాకే సరైన దాన్ని ఎంచుకోవడం మంచిది.

ట్రూ హెపా ఫిల్టర్ లేకుంటే వేస్టే:

Advertisement

ఎయిర్ ప్యూరిఫైయర్‌లో అన్నింటికంటే కీలకమైనది ఈ ఫిల్టరే. గాలిలోని అతి చిన్న దుమ్ము కణాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, ఇతర కంటికి కనిపించని అలర్జీ కారకాలను ఇది సులభంగా పీల్చేస్తుంది. దీంతో పాటు పెద్ద దుమ్ము కణాలను ఆపడానికి ‘ప్రీ-ఫిల్టర్’ ఉంటే ఇంకా మంచిది. ఈ రెండు ఫిల్టర్లు ఉన్న సాధనం గాలిని పూర్తిస్థాయిలో శుభ్రం చేస్తుంది.

Also Read: ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

కేడర్ రేటింగ్ కూడా ముఖ్యమే:

Advertisement

ప్యూరిఫైయర్ ఎంత వేగంగా గాలిని శుభ్రం చేయగలదో చెప్పేదే ‘సి.ఎ.డి.ఆర్’ రేటింగ్. ఈ రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే.. గదిలోని పొగ, దుమ్ము అంత వేగంగా శుభ్రమవుతాయి. కేవలం చూడటానికి బాగుందని లేదా తక్కువ ధరకు వస్తుందని ఏది పడితే అది కొనకుండా.. ఈ రేటింగ్‌ని తప్పకుండా చెక్ చేయండి.

ఇంట్లో వాసనలు రాకూడదంటే:

చాలామంది హెపా ఫిల్టర్ ఉంటే చాలు అనుకుంటారు. కానీ, ఇంట్లో వంట చేసేటప్పుడు మసాలా వాసనలు, పొగ లేదా గ్యాస్ వాసనలను హెపా ఫిల్టర్ తొలగించలేదు. దీనికోసం ‘యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్’ చాలా అవసరం. ఇది ఇంట్లోని రకరకాల దుర్వాసనలను పీల్చేసి, గాలిని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంచుతుంది.

తక్కువ శబ్దం వచ్చేది బెస్ట్:

మనం ప్యూరిఫైయర్‌ని ఎక్కువగా బెడ్‌రూమ్‌లో లేదా ఆఫీస్ వర్క్ చేసుకునే రూమ్‌లో వాడుతుంటాం. అలాంటప్పుడు అది మితిమీరిన శబ్దం చేస్తే ప్రశాంతత పాడవుతుంది. అందుకే అది పనిచేసేటప్పుడు వచ్చే శబ్దం తక్కువగా ఉందో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా రాత్రివేళల్లో హాయిగా నిద్రపోవడానికి ‘స్లీప్ మోడ్’ ఉన్న మోడల్స్ ఎంచుకోవడం చాలా మేలు.

వీటినీ చెక్ చేసుకోండి:

అంతేకాకుండా.. కేవలం ప్యూరిఫైయర్ కొనే ధర మాత్రమే కాకుండా, భవిష్యత్తులో దాని ఫిల్టర్ మార్చడానికి ఎంత ఖర్చు అవుతుంది, మార్కెట్‌లో అవి తేలికగా దొరుకుతున్నాయా లేదా అని ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ప్రశాంతమైన గాలితో పాటు మన ఆరోగ్యమూ పదిలంగా ఉంటుంది.

Also Read: ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×