E-Paper
Advertisement

కాఫీ విత్ కరణ్‌ షోలో ‘విరోష్’ సందడి.. విజయ్ -రష్మిక పెళ్లి రహస్యం లీక్‌!

కాఫీ విత్ కరణ్‌ షోలో ‘విరోష్’ సందడి.. విజయ్ -రష్మిక పెళ్లి రహస్యం లీక్‌!
Advertisement

Virosh:టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.తాజాగా రణబాలి తో హిట్ అందుకున్న ఈ జంట, పెళ్లి తర్వాత మొదటిసారిగా బాలీవుడ్ పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 9’ లో సందడి చేశారు. హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ఫన్నీ ప్రశ్నలకు సమాధానమిస్తూ తమ లవ్ స్టోరీ మరియు మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి ఆసక్తికర రహస్యాలను బయటపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

100 సార్లు అడిగితేనే ఒప్పుకున్నా:

కరణ్ జోహార్ ప్రశ్నకు విజయ్ ఆసక్తికర సమాధానమిచ్చాడు. రష్మిక తనను ఏకంగా 100 సార్లు పెళ్లి చేసుకుందామని అడిగిందని వెల్లడించాడు. దానికి రష్మిక స్పందిస్తూ.. అవును, నిజంగానే విజయ్‌ను ఒప్పించడానికి ఏడాది పాటు రోజూ అడుగుతూనే ఉన్నానని ఒప్పుకోవడంతో సెట్‌లో నవ్వులు పూశాయి.

హ్యాపీ మ్యారేజ్ లైఫ్ క్రేజీ ఫార్ములా:

Advertisement

పెళ్లి తర్వాత సంతోషంగా ఉండాలంటే భార్య మాట వినడమే గోల్డెన్ రూల్ అని విజయ్ దేవరకొండ సరదాగా చెప్పుకొచ్చాడు. తాను కూడా అందరు భర్తల్లాగే భార్య మాట వింటానని విజయ్ అనడంతోపక్కనే ఉన్న రష్మిక ఈ మాటలకు తెగ సంతోషపడింది. ఇక రష్మిక కాకుండా వేరే ఏ హీరోయిన్‌తోనైనా విజయ్ కెమిస్ట్రీ బాగుంటుందా అంటే.. “నోబడీ” అని రష్మిక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.

also read:కావ్యతో పెళ్లి.. వైరల్ గా మారిన అనిరుధ్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!

అల్లు అర్జున్ వర్సెస్ రణ్‌బీర్ కపూర్:

Advertisement

రాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ విషయంలో అల్లు అర్జున్, రణ్‌బీర్ కపూర్‌లలో ఎవరిని ఎంచుకుంటావని రష్మికను అడిగారు. దీనికి ఆమె ఏమాత్రం ఆలోచించకుండా అల్లు అర్జున్ పేరును చెప్పింది.అలాగే సెలబ్రిటీలకు కాల్ చేసే సెగ్మెంట్‌లో విజయ్ దేవరకొండ ఏకంగా అల్లు అర్జున్‌కి ఫోన్ చేసి మాట్లాడటం ప్రోమోకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జియోహాట్‌స్టార్‌లో అక్టోబర్ 21న స్ట్రీమింగ్:

కరణ్ జోహార్ మార్క్ మసాలా క్వశ్చన్స్, సరదా గేమ్స్, హోర్నిమన్ సర్కిల్‌పై రష్మిక ఫన్నీ కామెంట్స్ ఎపిసోడ్‌పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇక అల్లు అర్జున్, రణ్‌బీర్ వంటి స్టార్ల గురించి విజయ్ మాట్లాడిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ అక్టోబర్ 21న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కాబోతోంది.

ఇక మొత్తానికి చూస్తే, పెళ్లి తర్వాత ‘విరోష్’ జంట కలిసి పాల్గొన్న మొదటి టాక్ షో కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ పర్సనల్ లవ్ స్టోరీలని ఓపెన్‌గా పంచుకుంటూ విజయ్-రష్మిక చేసిన సందడి ఈ ఎపిసోడ్‌ను సీజన్‌కే హైలైట్‌గా నిలబెట్టేలా కనిపిస్తోంది.

Related News

తెరపైకి సింగర్ పీ సుశీలమ్మ బయోపిక్ చిత్రం? హీరోయిన్ ఎవరంటే?

ఆదర్శ కుటుంబం సెకండ్ సింగిల్ ‘మాల’ లిరికల్ సాంగ్ రిలీజ్!

కావ్యతో పెళ్లి.. వైరల్ గా మారిన అనిరుధ్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!

జైలర్ 2 మూవీ.. రజిని మనవడి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు.. ఏకంగా ముగ్గురు అరెస్ట్!

విజయ్, ర‌ష్మిక మైల్ స్టోన్ మూవీగా ‘రణబాలి’.. బ్లాక్ బస్టర్ టాక్ తో దూకుడు..

రామ్ పోతినేని సినిమాలో జెనిలియా భర్త.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×